అంతరంగాలు
కప్పుకున్న శాలువాను చెవుల చుట్టూ బిగించి కిటికీలోంచి బయటకు చూశాను. పొగమంచు తెరల చాటు నుండి దోబూచులాడుతున్న లేఎండ ఉదయపు చల్లదనాన్ని కదిలించలేకపోతోంది.
నాకు ఎక్కడ లేని బద్దకం ముంచుకు వచ్చింది. ఏమీ చేయబుద్ది కాలేదు. మెల్లగా కుర్చీని ఎండపొడలోకి జరుపుకొని కూర్చున్నాను. శాలువాను తలపై నుంచి తీసి, గేటు వైపు చూశాను.
సైకిల్ మీద పేపర్ అబ్బాయి వేగంగా వచ్చాడు. పేపర్ చుట్టి లాఘవంగా లోపలికి విసిరి, వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు.
పేపర్ నా పక్కన వచ్చి పడింది. మెల్లిగా వంగి, పేపర్ని చేతిలోకి తీసుకుని, యధాలాపంగా తిరగేశాను.
రైలు బస్సు ఢీ! వంద మంది ఠా!
నిరాసక్తిగా పేపర్ను మడిచేయబోయాను. ఓ రంగుల వర్ణచిత్రం నన్ను ఆకర్షించింది. ఆ చిత్రంలో చెప్పుకోదగ్గ ప్రత్యేకతేమీ లేదు. ఎవరో యువజంట వివాహ మహోత్సవమట. శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సన్నిహితులెవరో ఇచ్చిన ప్రకటన అది........................