• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Antharvikshana

Antharvikshana By Chikkala Krishna Rao

₹ 70

                             భగవాన్ శ్రీ రమణ మహర్పుల సూచనలు, ఉపదేశాల గురించి పర్యాలోచన చేయడం ఎంతైనా మంచిది. అవసరం కూడాను. అటువంటి యోచన ఎటువంటి ఆధ్యాత్మిక మార్గం గురించి అయినా అవసరమే. రమణుని విషయంలో అటువంటి యోచన మరింత ఎక్కవ అవసరం. సాధనకు - లక్ష్యానికి మధ్య దూరం లేదు. అలాగే మెట్లు, అంతస్తులు లేవు. రమణుని మార్గం “ఆత్మవిచారణ”. అది అత్యంత సులువైనది - సూటైనది - సహజమైనది. ఆ మార్గంలో “ఇది చెయ్యి, అది చెయ్యకు” అనే పద్ధతి లేదు. నిర్ణీత, నిబంధనలేవీ లేవు. సహజానుభవ స్వరూప - స్వభావాలు, వాటి స్థితిగతులు, సహజానందం సాధనకాలమంతా ఒకే విధంగా వుంటుంది. సాధనాకాలంలో ఆ ఆనందానుభవ స్థితినుంచి - సాధకుడు అప్పుడప్పుడు బైటికి రావడం, మళ్ళా లోపలకు వెళ్ళడం జరుగుతుంది. ఆ స్థితిలో స్థిరంగా, నిరాటంకంగా, నిరభ్యంతరంగా నిలవడమే - గమ్యం చేరడం.

                            రమణుని సూటిమార్గాన సాధన చేస్తే, ఎదురయ్యే సమస్యల్ని లేక అందులో అంతర్లీనంగా వున్న విషయాల్ని అవగాహన చేసుకునేందుకు సరైన అంతర్వీక్షణ అవసరం, ముఖ్యం కూడాను. -

                           “అంతర్వీక్షణ” అనే ఈ గ్రంథంలోని అంశాలపై పాఠకుని శ్రద్ధ మళ్ళితే అప్పుడు అతనికి ఈ గ్రంథంలోని అభ్యాస పద్ధతి పూర్తిగా అర్థమౌతుంది."

  • Title :Antharvikshana
  • Author :Chikkala Krishna Rao
  • Publisher :Chikkala Krishna Rao
  • ISBN :MANIMN2905
  • Binding :Paerback
  • Number Of Pages :131
  • Language :Telugu
  • Availability :instock