అంతుపట్టని మనిషి మురళీధర్
రామ్మూర్తిని గూర్చి ఎందుకు రాయాలంటే...
రామ్మూర్తిని నేనెరుగను.
రామ్మూర్తిని నేనెరగను కదా! "ఎందుకు రాస్తున్నావు మరి?" అని సాగదీసి అడగొచ్చు మీరు. అడగొచ్చేమిటి? అడిగారు కూడాను. అంటే నేను రామ్మూర్తిని గూర్చి రాసే ముందర ఒక చిన్న ప్రకటన లాంటిది చెయ్యాలని అనుకోలేదు. గప్టాప్ రాసి, అంతకన్న గప్ చిప్ మార్కెట్లోకి విసిరివేద్దామని ఆశ - అదే దురాశతో (దురాశ అన్నివేళలా శిక్షార్హం కాదు గదా, అనేక సందర్భాలలో హర్షించదగినది అన్న గురువాక్యం వుంది). "ఇంతకాలం బట్టీ మరీ జోరుజోరుగా కుండపోతలా కురుస్తున్న హర్షాన్ని అంతకన్న పేరాశతో యింకుగా మార్చిరాసి పారేశానోయ్!" అన్నాను నాకు చాలాచాలా దగ్గరగా వుంటూ, ఆ కథంతా లోపాయికారీగా విన్న మిత్రుడితో.
నువ్వు పెద్ద 'కొలంబస్'ననుకోబోకు. కొలంబస్కి సంకెళ్ళు వేసి నువ్వు వట్టి 'హోక్స్' అన్నారట తెలుసా? పోదు, మరీ గొడవ నీది? మన కళ్ళ ముందు చూస్తూ చూస్తూ హుటాహుటీగా పెరిగిపోయిన వాళ్ళను, మనం నిద్రమత్తులో జోగుతున్నప్పుడు నిటారుగా ఎదిగిపోయిన వాళ్ళనీ చూడలేక, వాళ్లు అలా పెరగటానికి తను చేసినదేమీ లేదని తెలుసుకోవటం యిష్టం లేక, వూరుకోలేక, వూరుకోక చేసేది కూడా ఏమీలేక, వూరుకున్నప్పుడు ఏం చేస్తాం మనం?
ఇంతకీ రామ్మూర్తిని గూర్చి రామ్మూర్తే "నా జీవిత చరిత్ర విను నాయనా" అని చెప్పడు. ఎందువల్లనంటే రామ్మూర్తికి అలాంటి అవసరం లేదు. తన జీవితచరిత్ర ప్రజల నోట్లో పడి పది కాలాలపాటు బతకాలని అతను అనుకోవటం......................