ఓమ్ సమర్థ సద్గురు శ్రీ షిర్డీసాయి నాథాయ నమః
అనుభవ సిద్ధ మూలికా వైద్యం పార్ట్ - 1
మూలికా వైద్యం అనగానే సహజంగా ఆయుర్వేదంపట్ల అవ గాహన వున్న విద్యాధికులల్లోనే కాకుండా ఆక్షరజ్ఞానంలేని పామరజనంలో కూడా ఒక విధమైన నమ్మకం కలుగకపోదు. ఎందుకంటే ప్రతిమనిషి ఏదో ఒకనాడు మూలికల ప్రభావాన్ని గుర్తించేపుంటాడు. అదెలాగంటే- మామూలుగా పంటినొప్పులకో, పార్శ్వపు నొప్పులకో లేక బహిష్టు నొప్పులవంటి వాటికో ఆటు పల్లెలలోనూ ఇటుపట్నాలలోనూ అక్క డక్కడ చిట్కా వైద్యం చేసేవాళ్ళు వుంటూనే వుంటారు. చిట్కాలు ఆడవారు సైతం చేస్తుంటారు. వీరు యీ రక్తమైన వైద్యం. దాదాపు బహిరంగంగానే చేస్తుంటారు. సామాన్యంగా డబ్బులు కూడా తీసు కోరు కేవలం యిది ఉచిత వైద్యం అన్నమాట.
తెలివి, విజ్ఞానము అనేది ఏ ఒక్కరి సొత్తుకాదు. ఎవరికి తెలిసిన వైద్యం వారు చేస్తూనే వుంటారు. అవి సత్ఫలితాలను యివ్వటం కూడా మనం చూస్తూనే వున్నాము. ఈ రకమైన చిట్కా వైద్యం సహజంగా వంశపారంపర్యంగా వస్తూంటుంది. కనుక మూలికల ప్రభావంపట్ల మన దేశంలో ప్రతిమనిషికి కొద్దో, గొప్పో అవగాహన గుర్తింపు లేకపోలేదు.
ఈ మూలికా వైద్యంలో ఆల్లోపతి (ఇంగ్లీషు) వైద్యంలో సాధ్యం కాని జబ్బులను ఆద్భుతంగా దిగ్విజయంగా చేయవచ్చు నేను (ఈ గ్రంథ రచయిత) అలా ఎన్నో కేసులను చేశాను ఆ విషయం ముందు ముందు చర్చిద్దాం.
దురదృష్టకర విషయం ఏమంటే, ఆయుర్వేద మూలికల ప్రభావం పట్ల జనంలో వున్న కొద్ది, గొప్పో నమ్మకాన్ని ఆయుర్వేదం ...................