ఆ ఉదయం.. అంతర్యామి ఫోన్కాల్ అందుకున్న రాయవరం, స్టేషన్ హౌస్ ఆఫీసరు రఘు చరణ్ తన సిబ్బందితో రాజమహేంద్రవరం బయలుదేరాడు. ఓ కార్పోరేట్ హాస్పిటల్ ముందు ఆగింది జీపు. డాక్టరు ఎదురొచ్చి ఆహ్వానించాడు. పేషెంట్లు ఉండే ఓ స్పెషల్ రూముకు తీసుకువెళ్ళాడు. హాస్పిటలూ, రూమూ ఏ.సీలోనే ఉన్నాయి. బెడ్మీద ఓ వ్యక్తి పడుకుని ఉన్నాడు. తలకీ, చేతులకీ బేండేజీ కట్టబడి ఉంది. స్పృహలోనే ఉన్నాడు. “ఇతనే సార్ అతను” చెప్పాడు డాక్టరు పరిచయం అవసరం లేదన్నట్లుగా. ఏమిటన్నట్లు చూసాడు రఘు చరణ్. పేషెంటు లేచి కూర్చుని రఘు చరణి కి చేతులు జోడించి "సార్! నా పేరు 'సత్తి ప్రకాష్ రెడ్డి' మాది బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామం. రావులపాలెం నుంచి ఇంటికి వెళుతుంటే రాత్రి ఎనిమిదిన్నర సమయంలో లొల్ల గ్రామంలోని.. చింతలరోడ్డులో నాపై హత్యాప్రయత్నం................. |