• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Anupama Niranjana Madhavi

Anupama Niranjana Madhavi By Kalyani Nilarambam

₹ 225

ఆనాటి మహామనీషి

మాధవి నవలారచనకు ప్రేరేపణ పేరెన్నికగన్న సమాజ శాస్త్రజ్ఞులు శ్రీమతి ఇరావతి కర్వెగారి పుస్తకం 'యుగాంతం'. ఆ పుస్తకం చదివినప్పుడు నాకు పురాణాల్లోని వ్యక్తులను, ఆనాటి సమాజాన్ని వైజ్ఞానికంగా సమీక్షిం చడం సాధ్యం, అవసరం అని అనిపించింది. యుగాంతం తర్వాత నేను చదివిన పుస్తకం శ్రీపాద అమృత డాంగేగారి- 'ఇండియా ఫ్రం ప్రిమిటివ్ కమ్యూనిజం టు స్లేవరీ' (India from Primitive Communism to Slavery). డాంగేగారిది మార్క్స్ వాద దృక్పథంతో విరచితమయిన కృతి. ప్రాచీన భారతసమాజం గురించి వాస్తవ చిత్రాన్ని తెలుసుకోవటంలో ఈ రెండు పుస్తకాలు నాకు ఎంతో సహాయపడ్డాయి.

"వెట్టిచాకిరీ అమలులో ఉన్న సమాజంలో ఆడదాన్ని కొనుక్కోవటం, అమటం, దానంచేయటం చాలా సామాన్యమయిన విషయాలు. యయాతి | ఈవిధంగా తన కూతుర్ని అద్దెకివ్వటం మహాభారతంలోని ఉద్యోగపర్వం లోని, గాలవ ఋషి కథలో చెప్పబడింది" అన్న మాటను డాంగేగారి పసకంలో చదివాను. ఇది నిరంజనగారితో చెబితే మాధవిని నాయికగా చేసుకుని నవల రాస్తే బాగుంటుంది అన్నారు.

ఆలోచించిన కొద్దీ మాధవి పీడిత స్త్రీజాతికి ప్రతీకగా తోచింది. నా మనసునాకర్శించింది. అలాంటి పాత్ర చిత్రణకు మొదటిమెటుగా పురాణం గ్రంథాల్ని అధ్యయనం చేయసాగాను. మహాభారతం ఉద్యోగపర్వంలోని............

  • Title :Anupama Niranjana Madhavi
  • Author :Kalyani Nilarambam
  • Publisher :Analpa prachurana
  • ISBN :MANIMN3517
  • Binding :Paerback
  • Published Date :2022
  • Number Of Pages :210
  • Language :Telugu
  • Availability :instock