₹ 60
"ప్రియమైన శ్రీవారికి
లక్ష్మి నమస్కరించి వ్రాయునది : నేను రాత్రంతా బాగా ఆలోచించాను. ఒక్కసారి మన పెళ్ళి అయినా యూ పది సంవత్సరాల నుంచి, మనం గడిపిన జీవితం, యూ సంసారంలో నేను పొందిన సుఖం, ఆనందం యేమిటో, యిందులో నేను పడిన శ్రమ ఏమిటో, కూలంకషంగా నాలో నేనే తర్కించుకుని, చర్చించుకున్నాను! కానీ డబ్బు సంపాయించటం నాకు చేతకాని మాట నిజమేకాని, న శరీరశక్తితో, మీ సంపాదనలో యెంత భాగం కూడబెట్టేట్టు చేయగలిగానో, నా ఒక్కదానికే తెలుసు. అది మీకు గుర్తుచేయటం, నన్ను నేను కించపరుచుకొనటం అని భావిస్తున్నాను! "పనిపాట లేకుండా కూర్చుని తింటుంటే నీకు కష్టం తెలియటం లేదు" అని మీరు మాటిమాటికి విసుక్కుంటుంటే విని భరించటం, నన్ను కాదని ఉరుకోవటం నాకు శక్తికి మించినపని అవుతోంది."
-యద్దనపూడి సులోచనారాణి.
- Title :Anuragathoranam
- Author :Yaddanapudi Sulochanarani
- Publisher :Sri Vijaya Sai Offset Printers
- ISBN :MANIMN0592
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :150
- Language :Telugu
- Availability :instock