• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Anuvadinchadam Ela? ?

Anuvadinchadam Ela? ? By Govindaraju Chakradhar

₹ 180

అనువాదానికి దగ్గరిదారులు లేవు

జోడుగుర్రాల రౌతుకు ఆ రెంటి పోకడలూ, వాటి చరిత్ర, వయసు, ప్రవర్తన వంటి సమస్త ఆనుపానులూ తెలిసి వుండాలి. ఒకే తాటిపై సమాన స్థాయిలో, వేగంతో పట్టు తప్పకుండా నడిపించగలగాలి. గుర్రాలు తిరుగుబాటు చేసి రౌతే తిరగబడకుండా జాగ్రత్త పడాలి. అనువాదంలోనూ అచ్చు ఇదే పద్ధతి. రెండు భాషలలో సమాన ప్రవేశమూ పట్టూ ఉండటం అన్ని వేళలా అందరికీ సాధ్యం కాదు. కొందరికి కొన్ని సబ్జెక్టుల్లోనే పట్టుంటుంది. అవి మాత్రమే వారికి సాఫీగా సాగుతాయి. దీనికి తోడు మూల భాష ఏ కాలానికి చెందినదనే దాన్ని బట్టి ఆ పదజాలము, నేపథ్యమూ వుంటాయి. ఆ నాటి వ్యవహారంలో ఆయా పదాల అర్థాలూ గ్రహించగలగాలి.

ఇన్ని ఇబ్బందులు, పరిమితులు ఉన్నా అనువాద రచనలకు ఆదరణ పెరుగుతూ రావడం శుభ పరిణామం. తెలుగులో తర్జుమా అవుతున్న ఇతర భాషల సాహిత్యాన్ని పాఠకులు ఆసక్తిగా చదువుతున్నారు. సాంకేతికత ఫలితంగా ప్రపంచం కుగ్రామంగా మారింది. ప్రపంచీకరణతో దేశాల మధ్య రాకపోకలు, వాణిజ్య సంబంధాలు పెరిగాయి. వివిధ దేశాల మధ్య వారధులు నిర్మిస్తున్నది మాత్రం అనువాదాలే.

కృత్రిమ మేధ (ఎ.ఐ) క్షణ క్షణం అప్డేట్ అవుతూ సమస్త జీవన కార్యకలాపాలలోకి గుమ్మడి పాదులూ విస్తరిస్తోంది. ఈ సాంకేతికత పుణ్యాన రచన, అనువాదాల్లో చాలా వెసులుబాట్లు అంది వచ్చాయి. అనువాదాలు చేసేవి,ఒక భాషలోని ప్రసంగాన్ని ఏక కాలంలో మరోభాషలోకి మార్చి చెప్పేవి, మాటలను రాతలుగా మలిచేవి, తప్పులను, వ్యాకరణ దోషాలను సరిచేసేవి - ఇలా ఎన్నో యాప్ లు, సాధనాలు ఊపిరి సలపనివ్వడం లేదు. ఇంతటి విస్తారంగా సేవలు అంది వస్తున్నా కృత్రిమ మేధకూ దాని పరిమితులు దానికి ఉన్నాయి................................

  • Title :Anuvadinchadam Ela? ?
  • Author :Govindaraju Chakradhar
  • Publisher :Media House Publications
  • ISBN :MANIMN5715
  • Binding :Papar Back
  • Published Date :Oct, 2014 2nd print
  • Number Of Pages :162
  • Language :Telugu
  • Availability :instock