ALL ABOUT
అధ్యాయం - 1
ఆర్టికల్సు (Articles) సంక్షిప్త స్వరూపము - నిర్వచనాలు (Definitions))
ఆంధ్రప్రదేశ్ ద్రవ సంబంధిత విధి విధానముల గురించి సమగ్రంగా ఎ.పి. ఫైనాన్సియల్ కోడ్ (A.P. Financial Code Vol-I) ఒకటవ సంపుటియందు వివరించియున్నారు. అట్టి సంపుటి (Volume I) యందు విధి విధానముల గురించి మూడు వందల ముప్ఫై (330) విషయముల (Articles)పై సమగ్రంగా విధి విదానములు గురించి తెలియజేసియున్నారు. కార్యాలయపు నిర్వహణ సందర్భంగా, దినచర్య విధి విధానములు నిర్వహించు సందర్భంగా పాటించవలసియున్న ముఖ్యమైన విధి విధానములు గురించి పాఠకులు తెలుసుకొనటం అవసరం. అదే విధంగా ఏదైనా నియమ నిబంధనలు భవిష్యత్తులో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసిన సందర్భాలలో వాటిని కూడా ఉద్యోగులు పరిశీలించవలసియున్నది.
ఎ.పి. ఫైనాన్సియల్ కోడ్ ఒకటవ సంపుటి (A.P. Financial Code Vol-I) యందు మూడువందల ముప్ఫై ఆర్టికల్స్ (Articles) ఏయే విషయాలపై తెలియజేస్తున్నాయో సంక్షిప్తంగా క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి. అతి ముఖ్యమైన వాటిపై వివరంగా ప్రత్యేకమైన అధ్యాయములయందు తెలియజేయటం జరిగింది...........................