వాస్తుజౌతిష ధర్మశాస్త్ర ప్రవీణులనియు, మధురకంఠ స్వరాధ్యేతలనియు, నిర్దుష్టస్మార్తకర్మ ప్రయోక్తలని ప్రసిద్ది బడసినట్టియు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా చెరుకూరు గ్రామ వాస్తవ్యులైనట్టి బ్రహ్మశ్రీ కీ.శే. భారతుల శేషావధానులగారిచే శ్రీ సుదర్శనాచార్యకృత గృహ్యసూత్ర భాష్యాది ప్రయోగ ధర్మశాస్త్రములననుసరించు, బహువిమర్శనపూర్వకముగను దేశాచారానుగుణముగను, భట్టీయ ప్రయోగముగ వ్రాయబడి, బ్రహ్మశ్రీ సు. రామనాథ ఘనాపాఠి గారి చేతను వ్యాకరణ వేదాన శాస్త్రాద్యేతయగు, శతావధాని బ్రహ్మశ్రీ వేమూరి నృసింహ శాస్తుల గారి చేతను పరిష్కరింపబడిన అపురూప మహత్తర గ్రంథము.