జెన్
తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి
గేటు ముందర స్కూటరు భయంకరంగా పొరబోయి దగ్గుతోంది. కిక్ కొట్టే కొద్దీ పొడి దగ్గే తప్ప ప్రాణం పోసుకుంటున్న జాడలేదు. కృష్ణ మొహం చెమటతో తడిసిపోయింది. తన భార్యని మానభంగంచేసిన దుర్మార్గుడిలా కనిపించింది స్కూటరు. ఆఖరిసారి కసి కొద్దీ కిక్ కొట్టి, దగ్గి ఆగిపోయిన వాహనాన్ని అదే వేగంతో ఓ తాపు తన్ని నాలుగు బూతులు తిట్టాడతను.
“నీడలోకి రండి" గేటు వెనక నిలబడి అంది అతని భార్య. డాబానీడ ఆమె మీద పడుతోంది. మొహం తుడుచుకుంటూ ఆమె పక్కన నించున్నాడు. కృష్ణ. స్కూటర్ని చంపేయాలనిపించిందతనికి.
"ఛీ ఎదవ స్కూటరు. సరిగ్గా టైముకు పెంట పెట్టింది. పది రూపాయలక్కూడా ఎవడూ తీసుకోడు." తరువాత స్కూటరు శీలం గురించి అతని అభిప్రాయం వెలిబుచ్చాడు.
సరళ కొంచెం సిగ్గుపడి నవ్వుతూ అంది "ఛీ. మామయ్యగారు వింటారు"
"వింటే విన్నీ. మధ్యలో నీకేం? ఆఫీసుకెళ్ళేది నువ్వా? నేనా? దరిద్రం. నా కంటే ఎదవ ఎవడూ దొరక్క నాకమ్మాడు. నాకీ చండాలం పట్టింది...................