చీమ కుట్టింది - పుస్తకం పుట్టింది
అరుణాచలం గురించి సమాచారం కావాలీ అంటే ప్రస్తుతం తెలుగువారికి యూట్యూబ్ చూడటమే ఆప్షన్. కుటుంబంతో అరుణాచలం వచ్చేవారికి భాషవలనో, తెలియకపోవడం వలనో వచ్చే బాధకాలను పరిష్కరించే సాధకంగా, యూట్యూబ్లో లేని, ఉపయుక్త సమాచారం వీలైనంత ఎక్కువగా యాత్రికులకు చెప్పాలని నా ప్రయత్నం. కాశీలో మరణం, అరుణాచల స్మరణం లాంటి సాంప్రదాయకంగా అందరూ చెప్పే పద్ధతిలో ఈపుస్తకం రాయలేదు. పుస్తకాలు చదవడమే తగ్గిపోతున్న ఈ రోజుల్లో రెండుభాగాలుగా పుస్తకం ఎందుకూ అంటే -
1) ఆలయాల సమాచారంతో, తత్కాల్ రిజర్వేషన్లు, హోటళ్ల వంటివి కలిపి రాయడం జెల్ అవట్లేదు. 2) యూట్యూబ్ వీడియోలే 10 నిముషాల లోపు చేస్తుంటే, రెండొందల పేజీల పుస్తకాన్ని ఎవరు చదువుతారు? అందువలన మొదటి భాగం భక్తి సమాచారం, రెండో భాగంలో గిరి ప్రదక్షిణ తరువాత పూర్తిగా Travel Information (English లోనే) ఇచ్చాను.
మా పెద్దమేనత్తగారు “క్షేత్ర వాసీ - మహా పాపీ" అని సామెత చెప్పేవారు. క్షేత్రంలోనే ఉండేవారికి, బయటనుంచి వచ్చే యాత్రికులకు వున్నంత శ్రద్ధాభక్తులు వుండవని భావం). నేను పండితుడనో, ప్రవచనకారుడినో కాని మామూలు అరుణాచల నివాసిని. అందువలన సేకరించిన సమాచారాన్ని ఇంట్లో మాట్లాడుకునే వాడుక భాషలోనే చెప్పే ప్రయత్నం చేశాను. సూటిగా మీకు ఏది తెలుసుకోవాలని వుంటే ఆ సమాచారం మాత్రం ఇచ్చేలా Search Option తో అతిత్వరలో 'అరచేతిలో అరుణాచలం' యాప్ రాబోతోంది. అందువలనే ఈపుస్తకంలో (చిన్నసైజు దృష్ట్యా) నావిగేషన్ మాప్లు ఇవ్వలేదు.
ఇప్పటివరకూ అరుణాచలం రాలేనివారికికూడా, ఈ పుస్తకాలు చదివిన తరువాత, అరుణాచలంయాత్ర చేసినట్లు అనిపిస్తే, ధన్యోస్మి. శివాజ్ఞ నేను సరిగ్గా నెరవేర్చినట్లే!......................