• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Arjun S/O Sujatha Rao

Arjun S/O Sujatha Rao By Vijay Appalla

₹ 100

ఉత్కంఠభరితమైన కథ

- డా. ఏనుగు నరసింహారెడ్డి

అదనపు కలెక్టర్, మేడ్చల్ జిల్లా

89788 69183

జీవిత గమనంలోని ఒక పార్శ్వాన్ని కథ చిత్రిస్తే, మొత్తం జీవితాన్ని నవల చిత్రిస్తుంది. తెలుగు నవలకు నూరేళ్ళకు పైగానే వయసొచ్చింది. వేయి పేజీల వేయి పడగలు నుంచి నూరు పుటలూ దాటని మునెమ్మ దాకా నిడివితో సంబంధం లేకుండా ఎన్నో నవలలు విజయవంతమయ్యాయి. వంద నవలలు రాసీ మనకు గుర్తుండని వాళ్ళూ ఉన్నారు తెలుగులో, ఒక్క నవలతో మనల్ని నిలువనియ్యని ఆలోచనల్లో ముంచినవారూ ఉన్నారు. సామాజిక వస్తువుతో పాటు చారిత్రక నవలలు, డిటెక్టివ్లు, సైన్స్ ఫిక్షన్లు తదితరాలతో పాటు ఇంకా మనం నిర్వచించలేని విభాగాలు కూడా కొన్ని ఉన్నాయి. విజయ్ అప్పల్ల నవల 'అర్జున్ సన్నాఫ్ సుజాతరావు' అలాంటిదే. రచయితే చెప్పుకున్నట్లు ఇది ఒక తల్లి పట్టుదల వలన కొడుకు ఏమి అయ్యాడు' అనేది ఇందులోని ముఖ్య కథ. సుజాత, సుబ్బారావులకు సంతాన లేమి పెద్ద లోటుగా మారినప్పుడు డా. ప్రకాశ్ రాజ్ గారి ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయిస్తారు. డా. ప్రకాశ్ వైద్యంలో సుజాత గర్భం దాల్చడం, డెలివరీ టైంకు డాక్టర్ ఢిల్లీకి వెళ్ళిపోవడంతో డా. మురళీకృష్ణ వైద్యంలో సుజాత డెలివరీ జరుగుతుంది. సుజాత కొడుకు అర్జున్లో ప్రత్యేక లక్షణాలుంటాయి. దెబ్బ తగిలినా నొప్పిపెట్టదు. ఇస్త్రీ పెట్టెకు తగిలినా కాలినా, నొప్పి తెలియదు. పరీక్షలు చేయిస్తే అర్జున్కు 'కాంజెనిటల్ ఇన్ సెన్సిటివిటీ టు పెయిన్' అని తెలుస్తుంది. అందువల్ల బయటికి నొప్పి తెలియని అర్జున్కు శృతిమించిన దెబ్బ తగిలితే సడెన్గా ప్రాణాలకు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని డా. మురళీకృష్ణ హెచ్చరిస్తారు. ఈ హెచ్చరికను సుజాత................

  • Title :Arjun S/O Sujatha Rao
  • Author :Vijay Appalla
  • Publisher :Syam Publications
  • ISBN :MANIMN5681
  • Binding :Papar Back
  • Published Date :July, 2023
  • Number Of Pages :117
  • Language :Telugu
  • Availability :instock