• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Arogyanga Kadadhakaa

Arogyanga Kadadhakaa By Inturi Venkateswarlu Ias

₹ 150

వృద్ధాప్య నివారణ

మన ప్రారంభాన్ని ఆది నుండి ప్రారంభిద్దాం. తన పుట్టుక, తాను నేడు ఉన్నత స్థితికి చేరటానికి ముందు జరిగిన పరిణామక్రమం తెలుసుకోవాలనే ఉత్కంఠ మనల్ని సోలార్ వ్యవస్థ, అందులో భాగమైన మన భూగోళం, మానవ జాతి ఆవిర్భావం వైపు పయనింప చేస్తోంది. మన సౌర కుటుంబంలో ముఖ్యుడైన సూర్యుడు, తన ఆకర్షణకు లోబడి, తన చుట్టూ పరిభ్రమిస్తున్న మెర్కురీ, వీనస్, భూమి,మార్స్, జూపిటర్, శాటరన్, యురానస్, నెప్ట్యూన్ల తో పాటు, మరుగుజ్జు గ్రహాలైన ప్లూటో, డజన్ల కొద్దీ ఉన్న చంద్రులు, మిలియన్ల కొద్దీ ఉన్న గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్కలు, వీటన్నిటి ఆవిర్భావం సుమారు 450 కోట్ల సంవత్సరాలకు ముందే జరిగిందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. నేడు మనకు ఉన్న విషయ పరిజ్ఞానం ప్రకారం, మన సౌరమండలంలో ఒక్క మన భూగోళంలోనే ప్రాణుల మనుగడకు అవసరమైన వాతావరణ పరిస్థితులు కలవని తెలుస్తుంది.

ప్రాణికోటి యొక్క ఆరంభ దశ కవసరమైన మొదటి జీవకణం సముద్ర గర్భంలోనే ఆరంభమైందని నేటి పరిణామక్రమ జీవశాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. మన భూగోళంపై ప్రతి ప్రాణి యొక్క ప్రారంభదశ సముద్ర గర్భంలోనే ప్రారంభమైందని మనకు అర్థమవుతుంది. ఖగోళ జీవశాస్త్రజ్ఞురాలైన లారీ బార్జ్, మరియు నాసాలోని తన సహచర శాస్త్రజ్ఞులు సహితం ఈ వాదననే సమర్థిస్తున్నారు. ఇలా సుమారు మూడు వందల కోట్ల సంవత్సరాల క్రితం..............

  • Title :Arogyanga Kadadhakaa
  • Author :Inturi Venkateswarlu Ias
  • Publisher :Sahiti Prachuranalu
  • ISBN :MANIMN4761
  • Binding :Papar back
  • Published Date :Sep, 2023
  • Number Of Pages :208
  • Language :Telugu
  • Availability :instock