• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Aruna Taralu

Aruna Taralu By Rv Ramarao

₹ 200

నిఖార్సైన కమ్యూనిస్టు కంభంపాటి సీనియర్

నేను ఉస్మానియా విశ్వ విద్యాలంలో చదువుతున్నప్పుడు కంభంపాటి సత్యనారాయణ (1909-1983) ఒక మోపెడ్ మీద రోజూ వచ్చే వారు. ఆయనను కంభంపాటి సీనియర్ అనే వారు. లైబ్రరీలో గంటలు గంటలు గడిపే వారు. ఇలా ఆయన రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలలో గడిపారంటారు. ఆ పరిశోధన ఫలితమే "ఫ్రం స్టోన్ ఏజ్ టు ఫ్యూడలిజం” అన్న అపురూపమైన గ్రంథం. ఈ గ్రంథ రచన వెనక ఓ ఆసక్తికరమైన కథే ఉంది. ఆయన తండ్రి తుని దివాను. కంభంపాటి సత్యనారాయణ మాత్రం 1920 నుంచి జాతీయోద్యమంలో, ఆ తరవాత కమ్యూనిస్టు పార్టీతో పెనవేసుకుపోయారు. రైతులను సమీకరించి ఉద్యమం లేవదీయడం తండ్రికి నచ్చలేదు. అందువల్ల తండ్రి ఆయనను చేరదీసే వారు కాదు. చివరకు మరణశయ్య మీద ఉన్నప్పుడు కంభంపాటి (సీనియర్) తండ్రికి సేవ చేశారు. తండ్రి పశ్చాత్తాపపడి తన దగ్గర మిగిలిన పది వేల రూపాయలు సీనియర్కు ఇచ్చారు. డబ్బు మీద ధ్యాస లేని సీనియర్ ఓ మిత్రుడు అడగ్గానే ఇచ్చేశారు. మరో మిత్రుడు అలా ఎందుకు ఇచ్చేశారు వెళ్లి పట్రండి మీకు అంతో ఇంతో వడ్డీ వచ్చే ఏర్పాటు చేస్తా అన్నారు. ఆ రకంగా నెలకు కొంత వడ్డీ రూపంలో దక్కేది. ఆ డబ్బే ఆయన చరిత్ర పరిశోధనకు వినియోగించారు.

అంతకు ముందు కంభంపాటి కమ్యూనిస్టు పార్టీలో పూర్తి కాలం పని చేస్తే నెలకు రూ. 25 ఇచ్చేవారు. నెల ఖర్చులు పోను మిగిలిన డబ్బు సీపీఐకి వెనక్కు ఇచ్చేసేవారు. లెవీ కింద పావలా ముందే మినహాయించుకుని ఇచ్చేవారు. ఎవరైనా ఆయనకు పుస్తకం బహూకరిస్తే ధర ఎంతో చూసి ఆ మొత్తం ఇచ్చేసే వారు. "అయ్యా నేను మీకు గౌరవంతో ఇచ్చాను” అంటే “మీకు అది ఉచితంగా అచ్చు వేయలేదుగా?” అని జవాబు సాధ్యం..........................

  • Title :Aruna Taralu
  • Author :Rv Ramarao
  • Publisher :Vishalandhra Publishing House
  • ISBN :MANIMN5020
  • Binding :Papar back
  • Published Date :Jan, 2024
  • Number Of Pages :231
  • Language :Telugu
  • Availability :instock