• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Asadharana Prema

Asadharana Prema By Manjuluri Krishnakumari

₹ 300

1974 సంవత్సరం అక్టోబరు నెలలో హాయిగా ఉన్న సాయంకాలం పూనాలోని ఇరుకు సందులో ఇళ్ళ వరసల మధ్య యువతి వేగంగా నడుచుకుంటూ అందమైన ఉంగరాల జుట్టును ఉల్లాసంగా ఉన్న తన వదనంపై పరచుకుంటూ వెళుతోంది. ఆమె ఆఫీసుకి తేలికైన నూలు చీరలను ధరిస్తుంది. ఇతర సమయాల్లో జీన్సు,

వేసుకుంటుంది. కానీ ఈ రోజు ఎందుకనో తనకు తెలీకుండానే తన కిష్టమైన తెల్లని ఖాదీ చీరను ధరించింది. టెల్కో (టాటా ఇంజనీరింగ్ అండ్ లోకో మోటివ్ కంపెనీ) బస్సులో తనతోబాటు పనిచేసే ప్రసన్న అనే యువకుడు ఉండే ఫ్లాట్కి బయల్దేరింది. అతడు కూడా కర్నాటకకు చెందిన వాడు కావడంతో వారి మధ్య స్నేహం పెరిగింది.

ఇది మామూలు ప్రయాణం కాదని ఆమె గుర్తించింది. వెన్ను జలదరించి ఆమెకు ఉత్సుకత, ఉద్వేగం కలిగాయి.

ఆ యువతి ప్రసన్నని ఇష్టపడటానికి కారణం అతడు ఆమెలాగే పుస్తకాభిమాని. బస్సులో రోజుకొక కొత్త పుస్తకం తెచ్చేవాడు. ఆమె అతడు చదివే పుస్తకం వంక చూసి అది తాను ఇంతకు ముందే చదివిన “ది డిస్కవరీ ఆఫ్ ఇండియా” లేక 'మై ఎక్స్పెరిమెంట్స్ 'విత్ ట్రూత్' అని గమనించి ఆనందపడేది. కొన్నిసార్లు ఇద్దరు ఆ పుస్తకం గురించి మాట్లాడుకునేవారు. ఆమె తన అభిప్రాయాలను కచ్చితంగా చెప్పేది. కానీ ఈమధ్య ప్రసన్న ఆమెను చాలా ఆశ్చర్యపరిచాడు. ఆమె మునుపు చదవని, వినియుండని రచయిత జార్జి మైక్స్ పుస్తకాలను చదవడంలో నిమగ్నమవుతున్నాడు. మైక్స్ రచనల పేర్లు కూడా కొత్తగా 'హౌటు బి ఏ అలైన్' 'హౌటు టాంగో' 'ఏ సోలో అక్రాస్ సౌత్అమెరికా', 'హౌటు యునైట్-నేషన్స్', ఇలా ఉండేవి. ప్రతీ పుస్తకం మీద ఒక పేరు, ప్రదేశం వ్రాయబడి ఉండేది. ఆ ప్రదేశాలు కూడా అనూహ్యంగా విదేశాల పేర్లు - పారిస్, రోమ్, మ్యూనిక్, ఇస్తాంబుల్, కాబూల్ ఇలా ఉండేవి.

ప్రసన్నని "నీ దగ్గర పుస్తకాలన్నీ ఎక్కడివి? ఈ వ్యక్తి ఎవరు? అంతర్జాతీయ బస్సు కండక్టరా?" అని ఆమె అడగకుండా ఉండలేకపోయింది.

ప్రసన్న నవ్వాడు. 'అతను నా స్నేహితుడు. ప్రస్తుతం నా రూమ్మేటు. నేను, అతను, అతని స్నేహితుడు శశిశర్మ తల్లితండ్రులుండే ఫ్లాట్లో ఒక గదిలో ఉంటాము. అతను..............

  • Title :Asadharana Prema
  • Author :Manjuluri Krishnakumari
  • Publisher :Alakananda Prachuranalu
  • ISBN :MANIMN5682
  • Binding :Papar Back
  • Published Date :2023
  • Number Of Pages :272
  • Language :Telugu
  • Availability :instock