₹ 150
తెలుగు పాఠకుల ముందుకు నా కథలు, వ్యాసాల పుస్తకం అసమర్ధురాలి అంతరంగం తో వస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇది నాన్నగారి చిత్తజల్లు మనసుని తాకినంత ఆనందంగా వుంది. గోపీచంద్ కుమార్తెగా నేను మీకు పరిచయమే! తాతగారు రామస్వామి గారు, నాన్నగారు గోపీచంద్ గారు సంఘ సంస్కర్తలు, సాహితీస్రష్టలు. విశ్వమానవ దృష్టే కాక, విశ్వ దృష్టి కలిగినవారు. గోపీచంద్ అన్నట్లు "ఈ జీవితం ఏమిటి? ఈ చుట్టూ వున్న ప్రపంచం ఏమిటి?" అన్న తాత్విక దృక్పథం వారి పెంపకం వలన నాకు చిన్నతనంలోనే అలవడింది. వారి పుస్తకాల వలన ముఖ్యంగా తత్వవేత్తలనించి ఒక అన్వేషణలోనే, ఒక సత్యం అనుసరించటంలోనే గమ్యం వుందని తెలుసుకొన్నాను.
స్కూలు, కాలేజ్ రోజుల నించి కథలు వ్రాయటం మొదలుపెట్టి అప్పుడప్పుడు మాత్రమే వ్రాసేదాన్ని. నేను ఏదైనా చెప్పదలచుకొంటే మాత్రం వ్రాసేదాన్ని. అన్నీ ప్రచురించబడ్డాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి మా నాన్నగారు తపస్సులా వ్రాసేవారు.
- రజనీ సుబ్రహ్మణ్యం
- Title :Asamardhurali Antharangam
- Author :Rajani Subrahmanyam
- Publisher :J V Publications
- ISBN :MANIMN0466
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :120
- Language :Telugu
- Availability :instock