రొమిల్లా థాపర్ 1931 నవంబరు 30న లక్నోలో జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ లండన్లో 1958లో డాక్టరేట్ పొందారు. కురుక్షేత్ర యూనివర్శిటీలో 1961-62 మధ్యన, 1963-1970 మధ్య కాలంలో ఢిల్లీ యూనివర్శిటీలోనూ రీడర్ గా పనిచేసి ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆమెకు చరిత్ర కారిణిగా గుర్తింపు తెచ్చిన గ్రంధాలు అశోకుడు, మౌర్య వంశ పతనం; పురాతన భారత సామాజిక చరిత్ర, ఆదిమ భారత చరిత్ర, నూతన దృష్టితో ఆదిమ భారత చరిత్రపై కొన్ని వ్యాఖ్యలు; భారత దేశ చరిత్ర మొదటి భాగం; ఆదిమ భారత చరిత్ర; మూలాల నుండి 1300 క్రీస్తుశకం వరకు.
ఆధునిక సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉండడం, పౌరులు అసమ్మతులు వ్యక్తపరచడం వారి వాక్స్వాతంత్రంలో తప్పనిసరిగా ఒక భాగం అయి ఉండాలి. ఈ హక్కు వివాదాస్పదమే అయినా సమాజాలు నిరంతరంగా కొనసాగాలంటే అత్యంత కీలకం. భారత సమాజం కూడా ఇతర అనేక సమాజాలలాగే, ఏమాత్రం అసహనాలు, హింసలు లేని, ఆలోచనా సంఘర్షణలు లేని ఒక ఏకశిలా సాదృశ్యమైన సమాజం కాదు. మన సమాజంలో కూడా అసహనాలు, హింసలు, ఆలోచనల సంఘర్షణలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో కూడా భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే గళాలు అధికంగానే ఉండేవి. మనం ఒప్పుకోడానికి సిద్ధంగా ఉన్నదాని కన్నా ఎక్కువ మోతాదులోనే ఉండేవి.
- రొమిల్లా థాపర్