• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Asaya Padham ( Asayapadham)

Asaya Padham ( Asayapadham) By Telakapalli Ravi

₹ 180

భూమిక

ఉమ్మడి మద్రాసు కాంగ్రెస్ ప్రభుత్వం 1948 జనవరి 31వ తేదీన ఆంధ్రలో సమరశీల ప్రజా ఉద్యమంపైన, దానికి నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టుపార్టీపైన దాడిని ప్రారంభించింది. ఇందుకు చాలా కాలం ముందు నుంచి సన్నాహాలు జరిగాయి. గాంధీజీ హత్య, దాని పర్యవసానంగా ప్రజలకు, ఆర్.ఎస్.ఎస్. వర్గాలకు మధ్య రగిలిన ఘర్షణలు ఈ ఫాసిస్టు దాడి సాగించడానికి ఒక సాకుగా మారాయి. ఆ రాత్రి, బెజవాడలో కమ్యూనిస్టు దినపత్రిక "ప్రజాశక్తి" కార్యాలయం పైన, పార్టీ సిటీ కమిటీ కార్యాలయంపైనా, కృష్ణాజిల్లా కమిటీ, ఆంధ్రరాష్ట్ర కమిటీ కార్యాలయాలపైన, అనేకమంది ప్రముఖ కమ్యూనిస్టులు, వారి సానుభూతిపరులు యిండ్లపైన పోలీసులు విరుచుకు పడ్డారు. పెద్ద ఎత్తున అరెస్టు చేశారు. మొత్తం భారతదేశంలోనే అలాంటి దాడి జరగడానికిదే మొదలు.

నైజాంకు, అతని రజాకార్ల మూకలకు వ్యతిరేకంగా విమోచన కోసం తెలంగాణా ప్రజలు సాగిస్తున్న పోరాటానికి కృష్ణాజిల్లాలోని శక్తివంతమైన ప్రజా ఉద్యమం అండగా వుండేది. ప్రజాశక్తి నగర్ తో సహా ఒక స్థావరంగా ఉపయోగ పడుతుండేది. భారత ప్రభుత్వం నైజాంతో నిర్యుద్ధ సంధి చేసుకుని విప్లవ పోరాటంపై దాడికి దిగింది. అయితే తెలంగాణా కమ్యూనిస్టులు, తెలంగాణా ఆంధ్ర మహాసభ ఆ నిర్యుద్ధ సంధిని తిరస్కరించి సాయుధ పోరాటం కొనసాగించారు. మిగతా భారతదేశంలోని పీడిత ప్రజానీకానికంతకూ వెలుగుబాటగా తయారవకుండా వుండేందుకు గాను తెలంగాణా ప్రజల పోరాటాన్ని అణచి వేయాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఒకవైపున ఆయుధాలు సరఫరాతో నైజాంకు తోడ్పడుతూనే, మరోవైపున తెలంగాణా ప్రజాపోరాటానికి అండగా వున్న ఆంధ్రలోని ఉద్యమాన్ని, ప్రత్యేకించి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల ఉద్యమాన్ని తుడిచి పెట్టడానికి సిద్ధమయింది. మరోవైపున నైజాం నుండి, అతని రజాకారుల మూకల నుండి హైదరాబాద్ ప్రజలను కాపాడటానికని పైకి ప్రకటించుకుంది. ఆ ముసుగు క్రింద తెలంగాణా ప్రజల పోరాటానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం గుర్జా, సిక్కు-.................

  • Title :Asaya Padham ( Asayapadham)
  • Author :Telakapalli Ravi
  • Publisher :Prajashakthi Book House
  • ISBN :MANIMN6477
  • Binding :Papar Back
  • Published Date :July, 2025
  • Number Of Pages :149
  • Language :Telugu
  • Availability :instock