• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ashani Sanketham
₹ 150

కరువుకాలపు కల్లోల దృశ్యం

1943వ సంవత్సరం - బెంగాల్ చరిత్రలో అది దుర్భరమైన కాలం. బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రావిన్స్ (ఇప్పటి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, బీహార్) అంతటా ఆ ఏడాది కమ్ముకున్న భయంకరమైన కరువు దాదాపుగా మూడు మిలియన్ల ప్రజలను బలి తీసుకున్నది. ఆహార ధాన్యాల కొరత, మలేరియా, ఆహార లేమితో తలెత్తిన అనేక వ్యాధులు, వైద్య సౌకర్యాల లేమి, వలసలు... మృత్యుదేవత ఆగమనానికి అనేక మార్గాలు! ఈ కరువు కాలాన్ని 'Great Famine of Bengal' గా చరిత్ర నమోదు చేసింది.

రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమై అప్పటికే నాలుగేళ్ళు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధం తాలూకు దుష్ప్రభావాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుభవిస్తున్నాయి. బ్రిటిష్ వలస పాలనలోని భారతదేశంలో కూడా ఆర్థిక మాంద్యం మొదలయింది. బెంగాల్లో ఏర్పడిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడ అదనపు కష్టాలు కమ్ముకున్నాయి.

బెంగాల్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడినది. పెద్ద కమతాలన్నీ అగ్రవర్ణ భూస్వాముల చేతుల్లో ఉన్నాయి. గ్రామీణ ప్రజల్లో ఎక్కువమంది నిరుపేదలు. వ్యవసాయ విధానాల్లో నైపుణ్యాలు వృద్ధి చెందక, సాంప్రదాయిక పద్ధతుల్లోనే జరుగుతోంది. వీటికి తోడు యుద్ధం వల్ల రవాణా మార్గాలు మూతబడ్డాయి. బెంగాల్కు ధాన్యం సరఫరా అవుతుండిన బర్మా నుండి ధాన్యం రవాణా ఆగిపోయింది. సైన్యం అవసరాల కొరకు రైతుల నుండి తప్పనిసరి ధాన్య సేకరణ జరగడంతో ధాన్యపు నిల్వలు తరిగిపోయాయి. ధనిక రైతుల వద్దనున్న నిల్వలు బ్లాక్ మార్కెట్కు తరలిపోవటంతో సామాన్య ప్రజలకు ధాన్యం అందుబాటులో లేకుండా పోయింది.

ఈ పరిస్థితిని గురించి ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్, 'Poverty and Famines' అనే గ్రంథంలో విశ్లేషించారు. “సంప్రదాయ ఆర్థిక వేత్తలు చెబుతున్నట్టుగా 1943లో బెంగాల్లో ఆహారోత్పత్తి తగ్గటం వల్ల కరువు రాలేదు. ప్రజల్లో కొందరికి అని సంకేతం...................

  • Title :Ashani Sanketham
  • Author :Katyayani , Bibuthi Bhushan Bandhopadyai
  • Publisher :Hydrabad Book Trust
  • ISBN :MANIMN4454
  • Binding :Papar back
  • Published Date :March, 2023
  • Number Of Pages :135
  • Language :Telugu
  • Availability :instock