₹ 120
మనలో చాలామందికి చాలా ఆశలుంటాయి... కొన్ని ఆశయాలు ఉంటాయి.
కొందరు కలెక్టర్ కావాలి అనుకుంటారు. కొందరు లాయర్ కావాలి అనుకుంటారు...కొందరు డాక్టర్ కావాలి అనుకుంటారు..... మరి కొందరు యాక్టర్ కావాలి అనుకుంటారు. కానీ మన సుబ్బలక్ష్మిగారు మాత్రం రచయిత్రి కావాలి అని ఆశపడ్డది. ఆశపడడమేనా! పెళ్లి అయిన దగ్గరనుంచి భర్తగారి ప్రోత్సాహంతో పట్టువదలని విక్రమార్కుడిలా, పట్టు పరిశ్రమ స్థాపించి, ఆ పరిశ్రమలో పుంఖానుపుంఖాలుగా రచనలు వండి వార్చింది.
భర్తగారు ఎంతో సహనంతో అవిడ రచనలు ప్రతి రోజు ఆఫీస్కి వెళ్తూ, వెళ్తూ కొరియర్ లో పంపడం, అయన ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి ఆ రచనలు కూడా తిరిగి రావడం జరుగుతుంది.
-అత్తలూరి విజయలక్ష్మి.
- Title :Ashtavakra Nayikalu
- Author :Athaluri Vijayalakshmi
- Publisher :Visalandra Publications
- ISBN :VISHAL1103
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :143
- Language :Telugu
- Availability :instock