పతితులార భ్రష్టులార బాధాసర్పదష్టులార
ఏడవకండేడవకండేడవకండి....
మీకోసం కలంపట్టి మీతో నా గళం కలిపి
ఆకాశపుదారులెంట హడావిడిగా పరుగెత్తే
రథచక్రాల్.... రథచక్రాల్...
జగన్నాథ రథచక్రాల్....
భూమార్గం పట్టిస్తాను... భూకంపం సృష్టిస్తాను...
భూకంపం సృష్టిస్తాను....
శ్రీశ్రీ కవిత్వం, నా పైథ్యం కలిపి మహాప్రస్థాన గేయాలను నాలో నేనే చదువు కుంటున్నాను. శ్రీశ్రీ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాను. నా పక్కనే మహాప్రస్థానం పుస్తకం ఉంది. నాలో ఆవేశం ఉరకలువేస్తోంది. శ్రీశ్రీని నాలో నిలుపుకుంటున్నాను. పుస్తకం తెరిచాను. పేజీలు తిరగేస్తున్నాను. మహాప్రస్థానం పుస్తకం చదవడం అదే మొదలు. అప్పటికే ఎన్నో పుస్తకాలు చదివిన నేను ఇంతకాలంగా ఆ పుస్తకాన్ని ఎందుకు చదువలేదా అని ఆలోచిస్తున్నాను. పుస్తకంలో మునిగి తేలుతున్నాను.
"మనోజ్... ఓ మనోజ్...” నాన్న పిలుపుతో ఈ లోకంలో కొచ్చాను. పుస్తకం మూసి మంచంలో పెట్టాను.
'ఏంది నాన్నా..." అన్నాను.
"ఇయ్యాల్ల మన పాలేరు రాలేదు. కొట్టం కాడికి పో, ఎడ్లను తోలుకొని లాగలబోరుకు పో. వాట్ని మేపుకరా?" అన్నాడు.............