• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Asta Nagapuja

Asta Nagapuja By M Satyanarayana Sidhanti

₹ 99

Description

నాగుల సంక్షిప్త చరిత్ర

తో గజాననం వరదం దేవం మూష కోత్తమ వాహనం!

ఏక దంతం త్రినయనం గౌరీ పుత్ర మహం భజే||

విశిష్టమైన భారతీయ సంస్కృతి యందే గాక... సృష్టియందే నాగజాతి కొక ప్రత్యేక స్థానము కల్పింప బడియున్నది. పదునాలుగు లోకములలోను చివరన వుండే పాతాళ లోకము- ఈ జాతికి జన్మ స్థానము! -

'పాతాళ లోక వాసులు- నాగ రూపమును కలిగి వుంటారు. “దేవ, రాక్షస, యక్ష, గంధర్వ, నాగ, పితృ, మానుష గణములు" యను సప్త గణములలో.... సర్ప గణ మొకటిగా పేర్కొన బడినది. ఈ సంస్థ గణములో... నాగ, మానుష గణములకు- మహత్తరమైన అవినాభావ సంబంధము లున్నటుల చరిత్రలు ముఖ్యముగా దెలుపుచున్నవి.

నాగులు సహజముగా రజో గుణ స్వభావము కల వారు. వీరికి కోపము చాల అధికము! ఐననూ... అనుగ్రహము, దయ, ప్రేమ కూడ వీరి కధికముగ నున్నవి. తమను ఆరాధించి, ఉపకారము చేయు వారి మీద విశేష ఆదరాభి మానములను కలిగి వుంటారు. తమకు, తమ జాతికి అపకారము తల పెట్టే.... వారి పట్ల... ద్వేషమును పెంచు కొని, పగను సాధించుటకు ప్రయత్నించు చుందురు.

అత్యధికముగా... గాలినే ఆహారముగ స్వీకరింపుచు, బహు కాలము జీవించు ఈ నాగ జాతి స్వరాళము- చాల విచిత్రముగా నుంటుంది. వీరికి భూలోక వాసము, అచటి సుందర రమణీయ ప్రకృతి సౌందర్య శోభ మీద

అధిక ప్రీతి! మానవ సహచర్యము, మనుష్యుల ఆచార వ్యవహారముల నందు ఆదరణ, అనురక్తిని కలిగి వుంటారు. అందుకే... మానవులకీ భూలోకములోనాగుల తోటి వితి రాని బంధము ఏర్పడి యున్నది...........

  • Title :Asta Nagapuja
  • Author :M Satyanarayana Sidhanti
  • Publisher :Mohan Pablications
  • ISBN :MANIMN3576
  • Binding :Papar Back
  • Published Date :2008
  • Number Of Pages :80
  • Language :Telugu
  • Availability :instock