ముందుమాట
పరకాల ప్రభాకర్ పునర్వికాసపు మనిషి. ఆయన ఒక ఆర్థికవేత్త, పబ్లిక్ పాలసీ ప్రొఫెషనల్, కార్పొరేట్ సలహాదారు, ప్రజాభిప్రాయ సేకరణకర్త, ఒక రాజకీయ కార్యకర్త, విశ్లేషకుడు, రచయిత, తెలుగు సాహిత్యంలో దిట్ట, పండితుడు. 'పఠన కుతూహలం' ద్వారా ఆయన ప్రపంచవ్యాపితంగా తెలుగు వారికోసం గురజాడ, జాషువా, శ్రీ శ్రీ, దాశరథిల వచనాన్ని, కవిత్వాన్ని పరిచయం చేశారు. సుమారు 70 ఎపిసోడ్లలో రికార్డు చేసిన ఈ కార్యక్రమం తెలుగు సాహిత్యం, సంస్కృతి, సామాజిక అంశాల పట్ల ఆయనకున్న లోతైన పరిజ్ఞానాన్ని స్పష్టంగా వెల్లడిస్తుంది. ఆయన రాజకీయ వేదిక 'మిడ్ వీక్ మ్యాటర్స్' ద్వారా చాలా ఎపిసోడ్లుగా వెలువడిన ప్రసంగాలు వర్తమాన జాతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థపై ఆయనకున్న అవగాహనకు, అదే సమయంలో భారతదేశ అభివృద్ధి, ప్రజాస్వామ్యం, ప్రజా సంక్షేమం పట్ల ఆయనలోని ఆవేశపూరిత నిబద్ధతకు అద్దం పడతాయి.
ఇలాంటి వైవిధ్యభరిత వ్యక్తి నాకు స్నేహితుడు కూడ. దురదృష్టవశాత్తు ఈ స్నేహం పది సంవత్సరాల క్రితం నుండి మాత్రమే మొదలయింది. అంతేకాకుండా, ఇరువురమూ న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎనీయు) లోనే చదివినప్పటికీ మా మధ్య పదేళ్ల వ్యత్యాసం ఉంది. నేను 1970ల ఆరంభంలో అక్కడ చదవగా, ఆయన 1980ల ఆరంభంలో జెఎన్ యులో ప్రవేశించారు. మేము ఎట్టకేలకు కలుసుకున్న వెనువెంటనే స్నేహితులుగా, ఒకే మార్గంలో ప్రయాణించే వారిగా, కోల్పోయిన లక్ష్యాల గురించి ప్రచారం చేసేవారిగా మారిపోయాము. 'వంకర టింకర కర్రతో మనం తిన్ననైన దేన్నీ తయారు చేయలేం' అని ప్రభాకర్ అంటారు. అయినా, మేం ప్రయత్నిస్తాం. ఆ ఆశను మనుసులో పెట్టుకునే ఈ వ్యాసాల సంపుటి రాయబడింది. వంకర కర్రను తిన్నగా చేయాలన్న కాంక్ష పూనిన ప్రభాకర్ ఈ పనికి పూనుకున్నారు........................