• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Astitvam Chaitanyam KarmikaVargam

Astitvam Chaitanyam KarmikaVargam By Rao Krishna Rao

₹ 20

  1. అస్తిత్వం

మొత్తం మీద అస్తిత్వం గురించి చర్చించే శాస్త్రాన్ని 'సత్తశాస్త్రం' (Ontology) అంటారు. సత్త అంటే ఉనికి అని అర్థం. అస్తిత్వం (being) అంటే ఏమిటి? 'అస్తి' అంటే ఉండటం. ‘నాస్తి' అంటే లేకపోవడం. క్రీ.పూ. 6,5, శతాబ్దాలలో జీవించిన గ్రీకు తత్వవేత్త పెర్మనెడీస్ ఈ అస్తిత్వం, సత్త, లేదా బీయింగ్ భావనను తత్వశాస్త్రంలో ప్రవేశ పెట్టాడు. అది తరవాత అనేక పరిణామాలు చెందింది.

సుప్రసిద్ధ ఫ్రెంచి తత్వవేత్త డెకార్ట్ చెప్పిన “నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను” అనే మాటలు సుప్రసిద్ధం. 'నేను ఉన్నాను కాబట్టి నేను ఆలోచిస్తున్నాను' అనే భావం ఇందులో ఇమిడి ఉంది. ఆలోచించడానికి మనిషి భౌతికంగా ఈ ప్రపంచంలో జీవించి ఉండాలి కదా! డెకార్ట్ మనిషి ఆలోచనే అతని అస్తిత్వానికి నిరూపణగా భావించాడు. అంటే అస్తిత్వం, ఆలోచనలు (చైతన్యం) విడదీయరానివనే విషయం కూడా ఇందులో ఉంది.

మార్క్స్ రచనల్లో మొత్తం మీద (ఇన్ జెనరల్) సత్త శాస్త్రానికి ప్రాధాన్యత ఉన్నట్లు కనిపించదు. అదే సమయంలో మనిషి జీవన పరిస్థితులకు, మొత్తం మీద మనిషి అస్తిత్వానికి ఆయన రచనల్లో అత్యంత ప్రాధాన్యత ఉంది. మనం చర్చించబోతున్న విషయం మనిషి అస్తిత్వానికి, అతని చైతన్యానికి ఉండే సంబంధం గురించి. ఇందులో అస్తిత్వం అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి.

అస్తిత్వం అంటే ఉండటం, బతికి ఉండటం, మెలకువగా ఉండటం, పనిచేస్తూ ఉండటం, ఆలోచిస్తూ ఉండటం, ఇలా కొన్ని డజన్ల రకాల స్థితులను తెలియచేస్తుంది. వీటన్నిటిలోకి ప్రధానమైనది 'జీవించి ఉండటం'. జీవించి ఉన్నవాడే మెలకువగా ఉంటాడు, తింటాడు, ఆలోచిస్తాడు, పనిచేస్తాడు ఇంకోటేదైనా చేస్తాడు. ఇవేవీ శూన్యంలో.............

రావు కృష్ణారావు

  • Title :Astitvam Chaitanyam KarmikaVargam
  • Author :Rao Krishna Rao
  • Publisher :Vishalandra Publishing House
  • ISBN :MANIMN4334
  • Binding :Papar back
  • Published Date :April, 2023
  • Number Of Pages :93
  • Language :Telugu
  • Availability :instock