• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ateendriya Shaktulu

Ateendriya Shaktulu By Ramanasri

₹ 200

అతీంద్రియశక్తులు

దేశం పురోగమన దిశవైపు సాగుతోందో, తిరోగమనం వైపు మళ్ళుతోందో అర్ధం కావడంలేదు.

ఆధునిక వైజ్ఞానిక విస్తరణ ఆదిమానవుని ఆవిర్భావానికి అంకురార్పణ కాబోలు.

కాకపోతే ఏమిటి ? వేలాది సంవత్సరాల నమ్మకాన్ని త్రోసి రాజనడం కనిపెంచిన తల్లిని కాదనడం కాదా ?

"మహాభారత గాధ కేవలం కల్పితం" విఖ్యాత శాస్త్ర వేత్త డాక్టర్ సర్కార్ వాదన.

"ఒకవేళ భారతగాథ జరిగినా అది కేవలం ఓ చిన్న కుటుంబ కలహమేగానీ, తరతరాలుగా, యుగయుగాలుగా జ్ఞప్తిపెట్టుకొని కీర్తించుకోవలసిన మహాగాధ కాదు” ప్రొఫెసర్ శంకాలియా ఉవాచ :

రామాయణం జరిగిందా? లేదా? అసలు వాల్మీకి ఉన్నాడా? వ్యాసుడు ఉన్నాడా? లంక ఎక్కడవుంది ? రాముడు లంకకు వెళ్ళాడా? ఆంజనేయుడు సముద్రం లంఘించాడా? లేక ఓ చిన్న కాలువను దూకాడా (కోతి కాబట్టి ) ?

రాముడు దుర్మార్గుడు, సీత పిచ్చిది, శూర్పణఖ మంచిది. అప్పటి వ్యవస్థ బూర్జువా భావాలతో కూడుకున్నది. ఆ వ్యవస్థకు ప్రతినిధి రాముడు, అలాంటి రాముడ్ని పూజించడం మానవతను మంటకలపడమే, దేవుడ్ని నమ్మేవాళ్ళంతా బూర్జువా వాదులే. పేదలు ఆస్థిక విషవృక్షాల ఛాయల క్రింద మలమల మాడిపోతున్నారంటూ వాపోతున్న విషవృక్షాలు....... "ట్రంప్... ట్రంప్... ట్రంప్....” కాలింగ్ బెల్ శబ్దానికి ఆలోచనల నుండి తేరుకొని గుమ్మంవైపు చూశాడు ప్రొఫెసర్ బెనర్జీ.

రెండు క్షణాలాగి “ఎస్. కమిన్ !" అన్నాడు కుర్చీలో నుండి లేవకుండానే. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఆ వెంటనే పోస్ట్మాన్ లోపలకు వచ్చాడు. “నమస్తే సాబ్” అంటూ ఆ రోజు టపా అంతా తీసి టీపాయ్ మీద పెట్టి, సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు...................

  • Title :Ateendriya Shaktulu
  • Author :Ramanasri
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN4594
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :215
  • Language :Telugu
  • Availability :instock