అతిథి(కి) దేవుడు
సియాచిన్ గ్లేసియర్ పర్యాటకుల కోసం తెరిచారన్న ప్రభుత్వ ప్రకటన విన్న సలిలేంద్రకి అన్నాళ్ళుగా తను వెతుకుతున్న స్థలం దొరికినట్లని పించింది. సియాచిన్లో ఒకపాట, క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించాలన్న అతడి నిర్ణయం అతడి యూనిట్లోనే కాక, యావత్ సినీ వర్గాల్లోనూ ఒక సంచలనం రేకెత్తించింది.
సలిలేంద్ర నిర్ణయాలన్నీ సంచలనాలేననీ, అతడు ఖర్చుకీ, శ్రమకీ వెరవడనీ, అంతకుముందు అతడు నిర్మించిన రెండు భారీ బడ్జెట్ బ్లాక్ బస్టర్లు నిర్ద్వంద్వంగా నిరూపించాయి.
అన్ని వర్గాల ప్రేక్షకులకీ వినోదంతో పాటూ, మంచి సెంటిమెంటూ, సమాజానికి సందేశాన్ని అందించగల బలమైన కథ దొరకటంతో, మూడు వందల కోట్లు దాటిన పెట్టుబడితో ఈసారి తీస్తున్న ఈ మూడవ చిత్రంతో, తన రికార్డులు
తిరగరాసుకోవటంతో పాటూ, ఒక మంచి అభిరుచి గల దర్శక నిర్మాతగా తన పేరు భారత సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నది అతడి సంకల్పం.
అయితే, "హిమాలయ సానువుల్లో, అదీ ప్రపంచంలోకెల్లా ఎత్తయిన యుద్ధభూమిలో, పదిహేను వేల అడుగుల ఎత్తున, మైనస్ డిగ్రీలకి వెళ్ళే చలిలో షూటింగ్ పెట్టుకోవటం దుస్సాహసమే అనిపించు కుంటుంది" అన్నారందరూ.
వారందరికీ, సలిలేంద్ర ఇచ్చిన జవాబు : "దుస్సాహసం అనుకున్నా, అది మనకి ఓ నెల, మహా ఐతే నెలా పదిహేను రోజుల సాహసం. మరి జీవితాలే అక్కడ గడుపుతున్నవారి మాటేమిటి? ఆ హిమసానువుల్లో అహరహం దేశానికి................