అధ్యాయము 1
అంతా మన దృక్కోణంలో ఉంది
సానుకూలత - ప్రతికూలత
"జీవితం అంటే 10% మీకు ఎదురయ్యే అనుభవం అయితే మిగిలిన 90% మీరు దానిని ఎలా ఎదుర్కొంటారనేదే”
- జాన్ మాక్స్వెల్
నెమ్మదిగా, ప్రశాంతంగా, నిశ్చలంగా, నిబ్బరమైన మనసుతో వున్న వ్యక్తులు, అందరిలో కలిసి వున్నప్పటికీ ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆ విధంగా వాళ్లు ప్రత్యేకంగా ఉండేందుకు కారణం ఏమిటంటే, వాళ్లు తమను తాము సంయమనంతో, నియంత్రణలో ఉంచుకోగలగడమే. మితిమీరిన ఆత్రుత, ఆందోళన కలిగిన వ్యక్తులు నిరంతరం గందరగోళంగా ఉంటారు. అయితే ప్రశాంతమైన వ్యక్తులు పూర్తిగా యిందుకు భిన్నమైన మనస్తత్వంలో ఉంటారు. ఈ మనస్తత్వం ఏమిటో, దానిని మీలో ఎలా పెంపొందించుకోవాలో మరింత నిశితంగా పరిశీలించేందుకు ఈ పుస్తకాన్ని ప్రారంభిద్దాం.
ఇక్కడ మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురౌతుంది: మీ జీవితం ఎవరి నియంత్రణలో ఉండాలి?......