ఆత్మాగమనం
సుమారు ఆరువందల అరవై ఎనిమిది సంవత్స రాల క్రితం... అర్ధరాత్రి రెండు గంటల సమయం... అడవి నల్లటి రంగును పులుము కున్నదా అన్నట్లు చిక్కటి చీకట్లో మునిగి పోయింది.
దట్టమైన చెట్లసందుల నుంచి చందమామ దోబూచు లాడుతూ కన్పిస్తోంది. ఓ దట్టమైన కీకారణ్యంలో అర్ధరాత్రిపూట సామాన్యులు సంచ రించటానికి కాదుకదా... ఊహించటానికి కూడా భయపడే పరిస్థితిలో...
ఆ సమయంలో... అకస్మాత్తుగా చెట్లమీద గూళ్ళు కట్టుకొన్న పక్షుల గుంపులు టపటప రెక్కలార్పుతూ గల్లంతుగా ఆకాశంలోకి ఎగిరాయి. చెట్టును చుట్టుకుని బద్ధకంగా వున్న కాలనాగు ఒకటి పడగవిప్పి చూస్తోంది. ఆ అడవిలో వున్న ఓ చిన్న కాలిబాటలో ఎండుటాకులు నలుగుతున్న సవ్వడి.............
..