నా జీవిత చరిత్రకు ముందు మాటలు
నా జీవిత చరిత్ర వ్రాయడం, ఆ సంఘటనల పునశ్చరణ మిగిలి నా జీవిత కాల మార్గదర్శానికి ఉపయుక్తమనుకొం టున్నాను. ఇతరులు కూడా తెలుసుకోడం అవసరమనుకొం ఉన్నాను. ఈ వై శతాబ్దము ప్రారంభంనుంచి యిప్పటి వరకు 70 సంవత్సరాలపైగా నా అనుభవాలు పూర్తిగా
నాకు సంబంధించినవి మాత్రమేకాదు, నేను జీవిస్తున్న సంఘ జీవితానికి సంబంధించినవి కూడాను. తరతరాలనుండి మన సాంఘిక జీవితము మారుతూ వస్తూంది. మనం జీవిస్తున్న కాలంలో కూడా మారుతూంది. దానంతటది మారడం లేదు. మానవుల కృషివలన మారుతూ వుంది. ఈకృషిలో నాబోటి కొందరు నిమగ్నమైపోక తప్పదు. అయితే యిది ఎవరో కోరితే జరిగేదికాదు. ఎవరో వ్యతిరేకిస్తే ఆగేది కాదు. ప్రతి బంధకాలువ స్తే లక్ష్యాన్ని విడిచేదికాదు. విజయాన్ని సాధిస్తే అంతటితో పని పూర్తి అయినట్లు కాదు. నా జీవిత పోరాట ములో సుమారు 70 సంవత్సరాలు తక్కువ కాలము కాదు. ఇక ఎంతకాలము యీ పోరాటముంటుందో చెప్పలేను కాని తక్కువకాలమయినా ఎక్కువకాలమయినా సాంఘిక ఉన్నత మానవ పోరాటము సాగక తప్పదు.
నా చిన్నతనంలో నా భావాలు ఎక్కడికి దారితీస్తాయో 'నేను చెప్పలే' ఎ ఎచ్చు. యువదశలో నా భావాలయెడల పట్టు.........