నిత్యమైన యౌవనోత్సాహాన్ని వ్యక్త పరచడమెలా
ఎన్సినీటస్, కాలిఫోర్నియా * లోని మొదటి సెల్ఫ్-రియలైజేషన్ మందిరం, మార్చి 20, 1938
దైవ సామ్రాజ్యం మబ్బుల్లోనో, ఆకాశంలో ఒక నిర్దేశిత ప్రదేశంలోనో లేదు; మూసిన కళ్ళతో మీరు దర్శించే చీకటి వెనుకనే ఉంది. భగవంతుడంటే చైతన్యం; భగవంతుడంటే సంపూర్ణమైన ఉనికి; భగవంతుడంటే నిత్యనూతన ఆనందం. ఈ ఆనందం సర్వవ్యాపకమైనది. ఆ ఆనందంతో మీ ఏకత్వాన్ని అనుభూతి చెందండి. అది మీలోనే నెలకొని ఉంది; అది అనంతమంతటినీ పరివేష్టించి ఉంటుంది. పదార్థం యొక్క స్థూల స్పందనాత్మక పరిమితులకు ఆవల మార్పులేని అనంతుడైన పరమాత్మ, తన సార్వభౌమాధికారంతో, విస్తారతతో రాజ్యమేలుతున్నాడు. అంతులేనితనం అదే దైవ సామ్రాజ్యం; సచేతన పరమానందం, నిత్యము, అనంతం. మీ ఆత్మ విస్తరించి తన ఉనికిని అన్నిచోట్లా అనుభూతి చెందినప్పుడు, మీరు పరమాత్మతో ఏకమై ఉన్నారు.
ఆకాశం సాగరాన్ని కలిసే క్షితిజరేఖ అనే పూజావేదిక పైనున్న అనంతుడైన పరమాత్మునికి మనం ప్రణమిల్లుతున్నాం; మన లోపల ఉన్న శాంతి అనే పూజావేదిక పైనున్న లోకాతీతుడైన పరమాత్మునికి మనం ప్రణమిల్లుతున్నాం.
మనం ఎన్నిసార్లు అజ్ఞాన ప్రదర్శనలు చేసినప్పటికీ, మన లోపల నివాసమున్న తన సన్నిధి ద్వారా భగవంతుడు మనకి జీవితాన్ని ప్రసాదించడాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. పచ్చిక నేలలో ఆయన నిద్రిస్తున్నాడు; పువ్వులలో ఆయన కల కంటున్నాడు; పక్షులలో, జంతువులలో ఆయన మేల్కొంటున్నాడు; మానవుడిలో తాను మేలుకుని ఉన్నట్టు ఆయనకి తెలుసు. దివ్య మానవుడిలో ఆయన తనను తాను మళ్ళీ కనుగొంటున్నాడు.
గతించిన యుగాలలో, తమ పర్ణశాలలలో ఏకాంతవాసం చేసిన భారతదేశపు ఋషులు, గురువులు సర్వవ్యాపకుడైన పరమాత్మను మరుగుపరుస్తున్న రహస్యాల మర్మాలను వెలికితీశారు. ప్రతి మానవుడిలో నెలకొని ఉన్న జీవము, మేధల అపరిమితమైన శ్రోతస్సుతో మనశ్శరీరాలను అనుసంధానపరిచే అమూల్యమైన....................