• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Attar ( Itara Kathalu)

Attar ( Itara Kathalu) By K Nallatambi

₹ 120

అత్తార్ 

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఒక అత్తరు దుకాణంలో కూర్చుని ఉన్నాను. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇక్కడ ఏ భాష మాట్లాడేవారైనా దీన్నిఓల్డ్ సిటీ అనే అంటారు. హిందీ వాళ్ళు "పురానీ శహర్" అని కానీ, తెలుగు వాళ్ళు "పాత నగరం' అని కానీ, తమిళం మాట్లాడేవాళ్ళు "పళైయ నగరమ్" అని కానీ అనరు. ఉర్దూ మాట్లాడేవాళ్ళు, ఇంగ్లీష్ తెలియనివారూ కూడా ఓల్డ్ సిటీ అనే పిలుస్తారు. ఆంగ్ల భాషలోని ఈ రెండు పదాలు మనకు అక్కడి చార్మినార్ చుట్టుపక్కల కనిపించే గిజగిజలాడే రోడ్లు, ఇరుకు గల్లీలు, హలీమ్ చేసే ఫుట్పాత్ హోటళ్ళు, శేర్వాని కుర్తాలు వేసుకుని కళ్ళకు సుర్మా రాసుకుని మీసాలు తీసేసి ఉత్త గడ్డం పెంచుకుని తిరిగేవారు, నలుపు బుర్ఖాలు, గాజులు ముత్యాలు అమ్మే అంగళ్ళు, తోపుడు బళ్ళలో ఎత్తుగా పోసుకుని అమ్ముకునే రొట్టె బిస్కత్తులు, చాయ్ దుకాన్లు, బిర్యాని షేర్వా సువాసనలు వీటన్నిటినీ కళ్ళకు కనిపించేలా చేసేంతగా ఇతర భాషల పదాలు చేయలేవు. ఇది నిజమో భ్రమో అర్ధం కాదు. కానీ కొన్ని పదాలు అంత ప్రభావితం చేస్తాయి.

బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నన్ను ప్రమోషన్ పైన హైదరాబాద్ పంపించారు. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న నా ఆఫీస్ కు దగ్గరగా గగన్ మహల్ ఏరియాలో ఒక రెండు బెడ్ రూముల ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నాను. వచ్చి నాలుగేళ్ళయినా ఇంకా ఎవరూ స్నేహితులు అవ్వలేదు................

  • Title :Attar ( Itara Kathalu)
  • Author :K Nallatambi
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN4990
  • Binding :Papar Back
  • Published Date :Nov, 2023
  • Number Of Pages :90
  • Language :Telugu
  • Availability :instock