• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Avantsa Somasunder

Avantsa Somasunder By Chandu Subbarao

₹ 50

  1. శిశూదయం

రాజమహేంద్రవరం నుండి విశాఖపట్నం వెళ్లే దారిలో అన్నవరం గ్రామం వుంది. ప్రఖ్యాత సత్యనారాయణ స్వామి దేవాలయం ఆ వూళ్లోనే కొండమీద వుంటుంది. అన్నవరానికి అల్లంత దూరంలో శంఖవరం గ్రామం వుంది. ఆ వూళ్ళో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాలు హెచ్చుగానే వున్నాయి. అందులో వొకరు కాళ్ళూరి సూర్యప్రకాశరావు గారు. ఆయన భార్య వెంకాయమ్మ. వారికి పదిమంది సంతానం. ఏడవవాడు సోమసుందరం తెల్లగా, బొద్దుగా అచ్చం చందమామలా వున్నాడని 'సోమసుందరం' అని పేరు పెట్టారు. కుర్రవాడు చాకులా వుండి వూళ్ళో అందర్నీ ఆకర్షించేవాడు. తన తల్లి చెల్లెలు చిన్న వెంకాయమ్మకు పిల్లలు లేరు. ఆమె భర్త ఆవంత్స వెంకటరావుకు ఇల్లూ, భూమి వున్నాయి. అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోయాడు. తనకు తోడుగా, ప్రేమ కుమారుడిగా వుండగలడని భావించి సోమసుందరాన్ని దత్తత యీయమని అక్కనగింది. అక్క అంగీకరించి అయిదేళ్ళ పిల్లవాడ్ని సంప్రదాయబద్ధంగా చెల్లికి దత్తత యిచ్చింది. పిల్లవాణ్ణి తీసుకుని దత్తత తల్లి 'పిఠాపురం' చేరుకుంది. అన్నల్ని, తమ్ముళ్ళను, తండ్రిని, తల్లిని-ప్రేమను, వున్న వూరిని ఆటపాటల్ని అనురాగాల్ని వదిలి ఎందుకిలా తనకు శిక్ష విధించి దూరం చేస్తున్నారో తెలియని ఆ అయిదేళ్ళ బాలుడు ఆక్రోశించాడు. ఎడ తెరిపి లేకుండా ఏడ్చాడు. పిన్ని గుండెలకు హత్తుకుంది. తనే అమ్మనని చెప్పింది. ఒప్పించింది, మెప్పించింది. పిల్లలతో ఆటలాడించింది. పాటలు పాడించింది తనే పద్యాలు, పాటలు, కథలు చెప్పి మనస్సు మళ్ళించింది. కొద్ది నెలలకే ఆ బాలుడు ఆవంత్స సోమసుందరం అయ్యాడు. అతను శంఖవరంలో జన్మించి అప్పటికి అయిదేళ్ళయ్యింది. 1924 నవంబరు 18 తేదీని భవిష్యత్ ఆంధ్రప్రజానీకం గుర్తు పెట్టుకునేందుకుగాను సదరు చిరంజీవి జీవిత ప్రయాణం మొదలుపెట్టాడు !

ఆ చిన్న హృదయానికి "కన్న" తల్లి గుర్తు వచ్చి బాధకల్గడంతో సరిపోలేదు. భవష్యత్తులో వేలాది, లక్షలాది మాతా శిశు హృదయ ఘోషలను రికార్డు చేయవలసిన శక్తికి శిక్షణ కావాలనిపించిందేమో... సృష్టికి! కన్నతల్లి ఏడాది తిరక్కుండానే అనారోగ్యంతో...............

  • Title :Avantsa Somasunder
  • Author :Chandu Subbarao
  • Publisher :Sahitya Acadamy
  • ISBN :MANIMN4085
  • Binding :Papar back
  • Published Date :2021
  • Number Of Pages :128
  • Language :Telugu
  • Availability :instock