జయప్రదంగా జీవించేందుకు ఏ లక్షణం ఎక్కువ అవసరం?
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయవంతంగా జీవించాలని కోరుకొంటారు. వృత్తిలో రాణించాలని, సమాజంలో గుర్తింపు పొందాలని, జీవితాన్ని హాయిగా గడపాలని కలలు కంటారు. సాటి మనుషుల మధ్య మేటిగా ఎదిగి పదిమంది వద్దా ప్రశంసలు అందుకోవాలని ప్రతి వ్యక్తీ ఆరాటపడుతాడు. ప్రగతిని ఆశించడం మానవుల సహజ లక్షణం.
కాని ఆశించిన లక్ష్యాలను సాధించ గలగడం, కృషికి తగ్గ ఫలితాలను పొందగలగడం, జీవితాన్ని జయప్రదంగా గడపగలగడం చాల కొద్దిమందికి మాత్రమే సాధ్యపడుతూ ఉంది. సమాజంలో సాధకుల (achievers) సంఖ్య స్వల్పంగానే ఉంది. అధికశాతం మంది బలహీనతల వల్లను, స్వయం కృతాపరాధాల వల్లను జీవితంలో అలజడులు సృష్టించు కొంటున్నారు. అడ్డంకులు కల్పించు కొంటున్నారు.
పేద కుటుంబాలలో పుట్టినవాళ్ళూ, అరకొర చదువులు చదువుకొన్న వాళ్ళూ కొద్దిమంది ఓర్పుతో, నేర్పుతో ప్రతికూల పరిస్థితులను కూడా........................