అవినీతి నిరోధక చట్టము 1988
(THE PREVENTION OF CORRUPTION ACT 1988) 1. సంక్షిప్త శీర్షిక మరియు పరిధి (Short Title and Extent):-
(1) ఈ చట్టము "అవినీతి నిరోధక చట్టము 1988"గా పిలువబడవచ్చును. (2) ఇది జమ్ము మరియు కాశ్మీరు రాష్ట్రమునకు తప్ప భారతదేశము అంతటికి వర్తించును మరియు భారతదేశమునకు వెలుపల గల అందరు భారతీయ పౌరులకు కూడా వర్తించును.
(a) “ఎన్నిక” (Election) అనగా, ఏదేని చట్టము క్రింద, పార్లమెంటు సభ్యులను లేదా ఏదేని శాసనసభ యొక్క స్థానిక అధారిటీ లేదా ఇతర ప్రభుత్వ అధారిటీ యొక్క సభ్యులను ఎంపిక చేయు ఉద్దేశ్యము కొరకు, ఎటువంటి పద్ధతిలోనయినను, నిర్వహించబడిన, ఏదేని ఎన్నిక, అని అర్ధము;
(aa) "నిర్ధారితమయిన (Prescribed)" అనగా ఈ చట్టము క్రింద చేయబడిన నియమముల చేత నిర్ధారితమయిన అని అర్థము మరియు “నిర్ధారించు” (Pre- scribed) అను వ్యక్తీకరణ, తదనుగుణముగా అన్వయించుకొనబడవలెను;
(b) “ప్రభుత్వ విధి” (Public duty) అనగా, ఒక విధి దేని యొక్క నిర్వహణలో ఒక రాష్ట్రమునకు చెందిన సర్వజనులు (Public) లేదా ఒక సమాజము (Commu- nity) ఒక ప్రయోజనమును కలిగి ఉన్నది;
వివరణ :- ఈ క్లాజులో "రాష్ట్రము” అను మాట ఒక కేంద్ర, ప్రాంతీయ (Provin- cial) లేదా రాష్ట్ర శాసనము క్రింద స్థాపించబడిన లేదా ఒక ప్రభుత్వము చేత సహాయము పొందుచున్న లేదా నియంత్రించబడుచున్న లేదా స్వకీయమయిన ఒక సంస్థ లేదా "కంపెనీల చట్టము 1956" యొక్క సెక్షన్ 617 లో నిర్వచించబడినట్లుగా ఒక ప్రభుత్వ కంపెనీ కూడ కలుపుకొనబడి, అని అర్థము;
(c) "ప్రభుత్వ ఉద్యోగి" (Public Servant) అనగా :-
(i) ఏదేని ప్రభుత్వ విధి యొక్క నిర్వహణ కొరకు ప్రభుత్వము యొక్క ఉద్యోగములో ఉన్న లేదా జీతము పొందుచున్న లేదా రుసుము లేదా కమీషను చేత ప్రభుత్వము నుండి పారితోషికము పొందుచున్న ఏదేని వ్యక్తి;
(ii) ఒక స్థానిక అధారిటీ యొక్క ఉద్యోగము లేదా జీతములో ఉన్న ఏదేని.........