₹ 125
ఎం. ఎన్. రాయ్(1887 - 1954) గా ప్రసిద్ధుడైన మానవేంద్రనాథ్ రాయ్ వంట విలక్షణమైన వ్యక్తులు ప్రపంచంలోనే అరుదుగా ఉంటారు. ఒకరు ఒక రంగంలో నిష్ణాతులు కావచ్చు. అందులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. మరొకరు అదే విధంగా మరో రంగంలో విశేష ప్రతిభను కనబరచవచ్చు. కాని అనేక రంగాలలో ఉన్నత స్థాయిని చేరుకొని అంతలోనే దానిని వదిలిపెట్టి మరొక రంగంలో ప్రవేశించి - ఒక జీవన స్రవంతి నుండి మరొక జీవన స్రవంతికి చేరుకుంటూ, తన జీవితాన్ని పలురకాలైన జీవన స్రవంతులతో పరివృతం చేసుకుంటూ అన్ని రంగాలలోనూ మహోన్నత స్థాయినందుకున్న వ్యక్తులు ఊహకు అందని రీతిలో విలక్షణంగా ఉంటారు. అలాంటి వ్యక్తులకు ఉదాహరణ ఎం. ఎన్. రాయ్.
రాయ్ జీవితంలో అనేక దశలు ఉన్నాయి. మొదటి దశలో అతడు ఉగ్ర జాతీయవాది. తరువాత దశలో ప్రపంచంలో పలుచోట్ల కమ్యూనిస్టు వ్యవస్థను స్థాపించడానికి అంకితభావంతో కృషి చేసిన అంతర్జాతీయ కమ్యూనిస్టు.
- కోడూరి శ్రీరామమూర్తి
- Title :Avisrantha Anveshi M. N. Roy
- Author :Koduri Sriramamurthy
- Publisher :Pallavi Publications
- ISBN :PALLAVI052
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :133
- Language :Telugu
- Availability :instock