• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ayurveda Saram

Ayurveda Saram By Dr Gayathri Devi

₹ 100

ఆయుర్వేదంలో రెండు విభాగాలున్నాయి.

ఒకటి ఆరోగ్యవంతుల ఆరోగ్య రక్షణ - స్వస్థ వృత్తం అంటారు.

రెండవది ఆతుర వృత్తం - రోగులని ఆరోగ్యవంతులని చేయడానికి చేసే చికిత్సలకి సంబంధించిన విభాగం.

ఎటువంటి వారికయినా ముందు ఆరోగ్యాన్ని రక్షించుకోవడమే ప్రధానం. ఆరోగ్యమే మహాభాగ్యం. అనారోగ్యాల బారిన పడి అన్ని భాగ్యాలూ పోగొట్టుకునేకంటే కాస్త అవగాహనతో, మంచి ఆహార విహారపు టలవాట్లతో జీవిస్తే - అనారోగ్యాలకి దూరంగా ఉండవచ్చు. అలా అనారోగ్యాలకి దూరంగా ఉండడానికి ఏదయినా అద్భుతమయిన మూలికో, మందో ఉందని ఎవరయినా చెబితే, అనాలోచితంగా ప్రజలంతా కొంతకాలం దాని వెంటపడతారు. ఇది లోక రీతి. కానీ ఆరోగ్య రక్షణకి అడ్డమార్గాలు, అద్భుతాలు లేవనేది సత్యం.

ఈ నిజాన్ని ఒప్పుకున్నాక, మరో నిజం ఏమిటంటే ప్రతిరోజూ ఆహార, విహార విషయా లలో మనసు, నిద్ర వంటి అంశాల్లో శ్రద్ధ అవసరం. మనం నిత్యం చేసే ప్రతి పని ప్రభావం మన ఆరోగ్యం మీద పడుతుంది. లేదా అనారోగ్యాలకి కారణం అవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఎంతటి ధనవంతులయినా ఒకరోజు అలా వెళ్ళి ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనో ఆరోగ్యాన్ని కొనుక్కొని తెచ్చుకోలేరు. ఇది సత్యం. ఆరోగ్యాన్ని ప్రతివారూ చిన్నతనం నుండీ సంపాదించుకోవాలసిందే. అలా సంపాదించుకోవడానికి శరీరం పట్ల అవగాహన అవసరం.

అవగాహనకి అవసరమైన అంశాలని మీకు సులువుగా అర్ధం అయ్యేలా అవసరమైన మేరకు 'ఆయురారోగ్యాభివృద్ధిరస్తు' విభాగంలో అందిస్తున్నాను.

ప్రతి అక్షరమూ చదివి ప్రతి నిత్యమూ పాటించి అనారోగ్యాలకి దూరంగా ఉండండి.................

  • Title :Ayurveda Saram
  • Author :Dr Gayathri Devi
  • Publisher :Rushi Peetam Prachurana
  • ISBN :MANIMN4266
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :100
  • Language :Telugu
  • Availability :instock