సృష్టి
ఈ సృష్టి చాలా విచిత్రమయినది.
ఇది చాలా విలక్షణమయినది.
ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు. పశ్చిమాన అస్తమిస్తాడు.
చంద్రుడు రోజుకో రకంగా తన రూపం మార్చుకుంటాడు.
రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, కాలాలు, ఆయనాలు, సంవత్సరాలు..... కాలం అలా దొర్లుతూ.... ఉంటుంది.
అలాసాగే సృష్టిలో అనేకానేక జీవులు, అనేక జాతులు.... ఆశ్చర్యపోయేంత వైవిధ్యం ఉంది.
అలాగే మనిషి చరిత్ర మరింత వింత గొలిపే రీతుల్లో, అంతుపట్టని గతులతో సాగి పోతూంటుంది.
మనం పెద్దగా పట్టించుకోం, గుర్తుపెట్టుకోం..... కానీ మనిషి పుట్టుక దగ్గరనుండి చనిపోయే వరకు ఎన్ని మలుపులు తిరుగుతూ ఉంటుందో చూసారా జీవితం. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం.
ఒక్కో దశలో ఒక్కో అవతారం..... అలా కొంతకాలం... తర్వాత మనకి ఇంకో పాత్రకి రంగం సిద్ధమవుతుంది.
ఇన్ని అవస్థలు ఒక ముఖ్యమైన మూలాధారమైన ఇరుసుపై ఆధారపడుతూ ఉంటాయి. ఆ ఆధారం లేకపోతే జీవితం కుంటుపడుతుంది.
"శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం" అంటాడు కాళిదాసు.
మన పనులు సవ్యంగా చేసుకోవటానికి ముఖ్యమైంది శరీరమే కదా అని. అలాంటి శరీరం లేదా జీవితం పరమార్ధాలని నెరవేర్చడానికి "ధర్మార్ధ కామ మోక్షాణాం |ఆరోగ్యం మూలముత్తమమ్”............