జీవితం - సాగరం అనుకుంటే అనుభవాలే తరంగాలు, అప్పుడప్పుడూ విజృంభించే భీభత్సాలే యిక్కట్లు, కన్నీళ్లు, కడగండ్లు, ప్రమాదాలు, రోగాలు. అనాదిగా మానవుడు తన జీవితాన్ని పణంగా పెట్టి యెన్నెన్నో చిత్రాతిచిత్రమైన రుగ్మతలకు దివ్యౌషధాలను కనిపెట్టి కాలంతో పాటు కలిసి తన వునికిని నిలకడగాసాగింపజేస్తూ సృష్టికి తానే అధిపతిగా మసలుకుంటున్నాడు. యెన్ని చదువులు, శాస్త్రాలు, ఆచారాలు, సంస్కృతులు, సౌభాగ్యాలు, సంపదలు, కీర్తి, స్పూర్తులున్నా శరీరం వేదనతో తల్లడిల్లుతున్నప్పుడు యివేవీ ఆత్మ - దేహశాంతులను కల్గించలేవు. యెంత హోదాలోనున్నవారికైనా, యెంత గొప్ప పండిత శ్రేష్టునికైనా, యెంతటి రారాజుకైనా వ్యాధి కల్గిందంటే బ్రతుకు అర్థం లేనిదై చావుభయం పుట్టుకొస్తుంది. అప్పుడు తమ స్థాయి యేదీ అక్కరకు రాదు. భవనాలు, కార్లు, హెదాలు, అహంకారాలు ఆదుకోలేవు. కానీ యెంతటివారికైనా యే సమయంలోనైనా, యే చోటనైనా "వైద్యం” పీడితులను ఆదుకుంటుంది. అనురాగతాప్యాయతా సుఖకౌగిలిలోకి అక్కున చేర్చుకుని సేదతీర్చుతుంది. చావు భయంనుంచి యీవలికి లాగుతుంది. జ్ఞానం అధికమైనకొలదీ ప్రకృతి సహజత్వాన్ని కొత్త కొత్త పోకడలతో నాశనపర్చుకుంటున్న మానవజాతి, మనం అత్యంత వేగంతో మృత్యుసాగరంవైపు బ్రేకుల్లేని వాహనంలాంటి కాలయంత్రాన్నెక్కి దూసుకుపోతున్నామని కించిత్ యోచనలేక తాత్కాలిక ఆనందంతో కేరింతలు కొడుతుంది. యీనాడు మన విజ్ఞానం యెంత యెత్తుకు యెదిగినా, అలా భ్రమించడం అలవాటుగావటాన మనకేదీ అసాధ్యమన్నది లేదని పొరబాటును