ఉపోదాంతం
ఈ పుస్తకానికి ఏ పేరైతే బాగుంటుంది అని చర్చిస్తున్నప్పుడు, యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన మా ప్రచురణకర్త సైమన్ ప్రోసెర్ "ఆజాదీ” అని పేరు సూచించడంలో మీ ఆలోచన ఏమిటి అని నన్ను అడిగారు. ఒక్క నిమిషం కూడా సంకోచించకుండా నేను “ఒక నవల” అని జవాబిచ్చాను. ఆ సమాధానమయితే చెప్పాను కానీ, అలా చెప్పినందుకు నాకు నేనే ఆశ్చర్యపోయాను. ఎందుచేతనంటే ప్రపంచాలు, భాషలు, కాలము, సమాజాలు, సమూహాలు, రాజకీయాలు చుట్టి రావడానికి, ఎంత సంక్లిష్టంగా నయినా ఉండడానికి రచయితకు నవలలో స్వేచ్ఛ ఉంటుంది. నవల అంతులేకుండా క్లిష్టంగా ఉండవచ్చు, పొరలు పొరలు గా ఒక సంఘటనకు మరొక సంఘటన అంటుకొని ఉండవచ్చు. అయితే అది వదులుగా, వేలాడబడినట్లుగా లేదా యాదృచ్చికంగా జరిగినట్లు ఉండకూడదు. నవల అంటే నాకు బాధ్యత తో కూడిన స్వేచ్ఛ. నిజమయిన, ఏ సంకెళ్ళు లేని స్వేచ్ఛ - ఆజాదీ. ఈ పుస్తకంలోని కొన్ని వ్యాసాలు రచయిత తన నవలా ప్రపంచం నుండి, ఒక నవలా రచయిత్రి దృక్కోణం నుండి పరిశీలించి వ్రాసినవి. ఆ నవలలో కొన్ని ఏ విధంగా కాల్పనికత, ప్రపంచంలో చేరిపోయి తానే ప్రపంచమవుతుందో వివరిస్తాయి. ఈ వ్యా సాలన్నీ 2018 నుండి 2020 వరకు రెండేళ్ల వ్యవధిలో వ్రాసినవి. కానీ, ఆ రెండేళ్లు రెండు వందల సంవత్సరాల వలె గడిచినవి. ఈ కాలంలోనే కోవిడ్19 మనల్ని కాల్చిన చువ్వలతో వాత పెట్టింది. ప్రపంచం అంతా వంచన చెయ్యడానికి సిద్ధంగా ఉన్న ఒక ద్వారం గుండా నడుస్తున్నట్టుగా ఉండింది. గతంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతిక రంగాలలో విబేధాలు లేకుండా తిరిగి రాలేని చోటికి ఈ కాలంలోనే మనం ప్రయాణం చేసాం. ఈ సంపుటిలో చివరి వ్యాసం దాన్ని గురించే. కరోనా వైరస్ తనతో పాటు ఆజాది అంటే మరొక భయంకరమయిన అవగాహనను కూడా వెంట తెచ్చుకుంది: స్వేచ్ఛా విహంగమయిన ఈ వైరస్ అంతర్జాతీయ సరిహద్దులను అర్థం లేనివిగా మార్చింది, అన్ని దేశాల ప్రజల జనాభాలను బందీలుగా చేసింది, ఇంతవరకు ఎవరూ చెయ్యని విధంగా ఆధునిక ప్రపంచం మొత్తాన్ని చలనరహితం