• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Baba & Banjaay

Baba & Banjaay By Madhu Babu

₹ 120

బాబా

"నేను పుట్టక ముందునుంచీ యిక్కడే వున్నాట్ట! యాభై సంవత్సరాలు అయింది నేను పుట్టి..."

తన వెనుక నలుగురు విదేశీయులను సిసిసూ పర్వతాగ్రం మీది ఒక చీకటి గుహముందుకు తీసుకుపోతూ చెప్పాడు పర్వతం క్రింద నివశించే గ్రామీణుడు ఒకతను.

ముఖంమీది నుండి కనులలోకి జారుతున్న స్వేద బిందువుల్ని అరిచేతులతో అద్దుకుంటూ కనులు చిట్లించుకొని చూశారా విదేశీయులు.

చీకటి గుహముందున్న పెద్ద కొండరాయి మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు ఆ వృద్ధుడు.

ఎండకు ఎండి క్రిందికి వాలిపోయిన రెల్లుదుబ్బుల్లా అతని భుజాల మీద పరచుకొని వున్నాయి తెల్లటి శిరోజాలు, బలమైన గాలి ఒకసారి వీస్తే చాలు కొండరాయి మీది నుండి ఎగిరి అవతల పడిపోయేటట్లు కనిపిస్తోంది అతని స్వరూపం.

"మనకు కావాల్సిన మహనీయుడు ఇతనేనంటారా?" గొంతు తగ్గించి రహస్యంగా తన సహచరులతో అన్నాడు ఒక విదేశీయుడు. లోగొంతుకతో అన్న అతని మాటలు అతని స్నేహితులకు తప్ప ప్రక్కనే వున్న గ్రామీణుడికి కూడా వినిపించలేదు.

కంటికి కనిపించని అశరీరశక్తి ఏదో వాటిని తన చెవుల్లో వూదినట్లు చటుక్కున కనులు తెరిచాడు వృద్ధుడు. ఎదుటవున్న వ్యక్తుల్ని గమనించి మెల్లిగా తలపంకించాడు...............

  • Title :Baba & Banjaay
  • Author :Madhu Babu
  • Publisher :Satyavani Publications
  • ISBN :MANIMN5405
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :125
  • Language :Telugu
  • Availability :instock