• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Badi Bayati Pathalu

Badi Bayati Pathalu By Anuradha Nadendla

₹ 130

పన్నెండు బడి బయట జీవిత పాఠాలు

దేశ భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్య నిర్మితమవుతుంది అని డి. ఎస్. కొఠారి కమిషన్ అన్నమాట నాకు మన పిల్లల పాఠశాలలు చూసిన తర్వాత అర్థసత్యం అనిపిస్తుంది. విద్యారంగంలో పాఠశాలలకు మౌలిక వసతుల కల్పనలోనే ఇంకా సతమతమవుతున్న మన వ్యవస్థలు, ఈ లక్ష్యానికి తరగతి గదిని దూరంగానే వుంచాయనే చెప్పాలి. ఆర్థికంగా కాస్త ఉన్నత స్థితిలో వున్న ఆధిపత్య వర్గాలు పూర్వకాలం నుండి విద్యను అందుకున్నాయి గానీ కుల, మత, ఆర్థిక అంతరాలు ఎక్కువగా వున్న మన సమాజాల్లో తరాలుగా విద్యకు అందనంత దూరంలో చాలామంది పిల్లలు ఉండిపోయారు.

అటువంటి పిల్లలను ఆదుకోవడానికి ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కొన్ని పని చేస్తుండగా, విద్యకు దూరంగా వున్న పిల్లలకు విద్యను, విద్యేతర జ్ఞానాన్ని అందించడానికి కొంతమంది అంకిత భావం, ఆదర్శం గల ఉపాధ్యాయులు ముందుకు వచ్చి, తమకు చేతనయినంత మేర పిల్లలలో చదువు పట్ల ఆసక్తిని, అనురక్తిని కలిగిస్తూ, పని చేస్తున్నారు. అనూరాధ గారు తమకు దగ్గరలోని ఒక గూడెంలో పిల్లలను చేరదీసి, వారికి చదువు చెప్పడమే కాకుండా, వారిలో అన్ని రకాల వ్యక్తిత్వ మూర్తిమత్వం ఏర్పడడానికి కృషి చేస్తున్నారు. వారితో వున్న ఆ అపురూప అనుభవాలను చిన్ని చిన్ని కథల రూపంలో ప్రపంచంతో పంచుకునే...................

  • Title :Badi Bayati Pathalu
  • Author :Anuradha Nadendla
  • Publisher :Pracchaaya
  • ISBN :MANIMN6451
  • Binding :Papar Back
  • Published Date :Aug, 2025
  • Number Of Pages :84
  • Language :Telugu
  • Availability :instock