₹ 60
సింధు, హరప్ప, రాఖీగర్హి, కిలాడీ నాగరికతలు అతి ప్రాచీనమైనవి। నాటి ప్రజల నమ్మకాలు, సంస్కృతి నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసీ, దళిత, శుద్ర కులాల దినచర్యల్లో, పోలేరమ్మ, పైడితల్లి వంటి అమ్మల మొక్కుల్లో, శ్రమణుల తాత్వికతలో ప్రతిబింబిస్తుంది। ఇది బహుజనుల మతం। హిమాలయకావల మేరు పర్వతం, ఆముదర్య నది ప్రాంతం పచ్చిక బయాళ్ళలో గుఱేo, ఆవుల ఆధారంగా జీవించే ఆర్యలు కొందరు సింధు దాటి మన దేశంలోకి , మరికొందరు ఇరాన్, ఇరాక్, గ్రీస్ వంటి దేశాలకు క్రి।పూ।1600 సంవత్సరాల్లో చేరుకున్నారని చరిత్రకారులంటున్నారు। ఇటీవల జెనిటిక్స్ ఆధారంగా నిరూపించారు కూడా। ఈ జాతి నమ్మకాల్లో త్రిమూర్తులు, అగ్ని, వరుణ, ఇంద్ర , బ్రహ్మ వంటి దేవతలు మాట్లాడే బాషా కుటుంబాలు సంస్కృతంతో సహా ఒకటే। వీటిని గ్రహించే బ్రిటిష్ వారు ఈ నమ్మకాలను హిందూ మతం అన్నారు। బహుజనుల, అన్యుల ప్రత్యేకతల మధ్య జరిగిన ఘర్షణలు, చారిత్రిక, తాత్విక వైరుధ్యాలు ఇందులో విశ్లేషణాత్మకంగా వివరించబడ్డాయి।
- Title :Bahujana Hindu- Brahmaneeya Hinduthva Okatena?
- Author :Prof K S Chalam
- Publisher :Visalaandhra Publishing House
- ISBN :MANIMN1135
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :88
- Language :Telugu
- Availability :instock