ప్లీమన్ గురించి
ఎందుకు చదవాలంటారా!?
"హైన్రిక్ ప్లీమన్ ?!
ఎవరండీ ఈయన?
ఈయన గురించి తెలుగులో ఒక పుస్తకమా?
అసలీయనతో మనకేమిటి సంబంధం?
ఈయనమీద పుస్తకం రాస్తే మేము చదవాలా??”
-అని పాఠకులలో కొందరైనా అనుకుంటూ ఉండవచ్చు. అలా అనుకోవడం సహజమే, కనుక సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది.
నిజానికి ప్లీమన్ గురించి చదవకముందు, నేను కూడా ఇవే ప్రశ్నలు వేసేవాణ్ణి. స్లీమన్ గురించి చదివాను కనుక ఆ ప్రశ్నలు వేయవలసిన అవసరం నాకు కనిపించలేదు. ఈ ముందుమాటా, ఆ తర్వాత ఈ పుస్తకమూ చదివాక మీరు కూడా పై ప్రశ్నలు వేయరని నేను గట్టిగా నమ్ముతున్నాను.
రెండు కారణాల చేత స్లీమన్ నన్ను ఆకర్షించాడు: మొదటిది, అతనొక 'టైపు' మనిషి. అతని జీవితంలో, వృత్తి, ప్రవృత్తులలో గొప్ప వైవిధ్యం ఉంది. అతని బాల్యం దెయ్యాలు, భూతాల కథల మధ్యా, హోమర్ కథల మధ్యా, అవి సృష్టించే కాల్పనిక ప్రపంచంలోనూ, ఆ ప్రపంచం కల్పించే అద్భుతత్వంలోనూ................