మంచి చేసిన మారయ్య
ఒక ఊరిలో 'మార్లిన్' అనే ఒక ఇంగ్లీషు డాక్టరు ఉండేవాడు. అటువంటిపేరు మీకు జ్ఞాపకం ఉండడం కష్టం. అందువల్ల అతని పేరు మారయ్య అని పెట్టుకొందాం. ఇప్పుడు కథ ఎలా ప్రారంభ మవుతుందంటే -
ఒక ఊరులో 'మారయ్య' అనే తెలుగు వైద్యుడు ఉండేవాడు. చదువుకొంటున్న రోజుల్లో కూడ మారయ్య అనుకునేవాడు "ఈ ప్రపంచములో కుంటివాళ్లు, గుడ్డివాళ్లు, చేతులు లేనివాళ్లు, కళ్లులేనివాళ్లు ఇంతమంది ఉన్నారు కదా? వీళ్ల వల్ల ప్రపంచానికి ఏం లాభం?" తనతోటి విద్యార్థులతో కూడా ఈ విషయాలు చెప్పి వాదిస్తూ ఉండేవాడు.
మరీ చావు బ్రతుకులలో ఉన్న రోగులకన్నా, చివరి క్షణాలలో ఉన్న వృద్ధులకు వైద్యం చేయాలంటే ఓ రకమైన యీసడింపు, నిర్లక్ష్యం కనపరిచేవాడు. 'చచ్చేవాడు ఎలాగు చేస్తాడు - ఈ బాదర బందీ ఎందుకులే?” అన్నట్లుండేవాడు. స్నేహితులతో ఈవిషయం చెప్తే వారు అతన్ని మందలించేవారు.
“మనం ఇంకొకరికి సహాయం చేయడానికి పుట్టాం. మూగ, కుంటి, గ్రుడ్డివాళ్లను బాగుచేసి, వాళ్ల జీవితంలో మళ్లీ కొత్త ఆశలు కల్పించడానికి" అనేవారు.
“రోగంతో ఉన్నవాళ్లకు వైద్యంచేసి ప్రాణంపోసే బాధ్యత డాక్టరు. అయితే ఎందుకూ పనికిరాని రోగి ఉంటాడనుకోండి. వాడు బ్రతికికూడ ఎవరికీ లాభం లేనప్పుడు, చచ్చిపోతేనేం?” అని వాదించేవాడు.
మారయ్య ఒకరోజు ఆసుపత్రిలో ఉండగా పట్టణం మురికికూపంలో బ్రతికే బిచ్చకత్తె పురుడు పోసుకుందుకి ఆసుపత్రికి వచ్చింది. ఆమెకి ఒక పిల్లాడు పుట్టాడు. ఆమెకు ఆ పుట్టినవాడు ఏడవ కొడుకు. దురదృష్టవశాత్తు వాడికి ఒక కాలు పొట్టిగాను, ఒకకాలు పొడుగ్గాను ఉంది. పుట్టగానే ఊపిరి సరిగ్గా అందక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు, ఆ పసివాడు. అప్పుడు వైద్యుడు గాలిని నోటినిండా పూరించి పిల్లవాడి నోటిలో ఊదితే క్రమంగా గాలిపీల్చడం అలవాటు చేసుకొంటాడు కుర్రవాడు. అతని చెయ్యి చూచాడు మారయ్య. కాని మళ్లీ ఆలోచించాడు. "ఈ కుర్రవాడు పెద్ద జీవితమంతా కుంటివాడిగా బ్రతకాలి. అందరూ వీడిని 'కుంటికోతి' అని పిలుస్తారు. ఆట పట్టిస్తారు. వీడు బ్రతకక పోతేనేం? వీడు లేకపోయినంత మాత్రాన ప్రపంచానికి నష్టంలేదు" అనుకొన్నాడు.
కాని వైద్యుడిగా అతనికి ఒక ధర్మం ఉందిగా? ఆ ధర్మం అతనిని ఆగిపోనిచ్చింది. కాదు. మళ్లీ ప్రయత్నించి ఆ కుర్రవాడు గాలి పీల్చుకునేటట్టు చేశాడు. క్రమంగా కుర్రవాడి .............