• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Bala Vyakaranamu

Bala Vyakaranamu By Paravastu Chinnaiahsuri

₹ 360

బాలవ్యాకరణము

సంజ్ఞాపరిచ్ఛేదము

  1. సంస్కృతమునకు వర్ణము లేఁబది.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ (లు, లూ) ఎ ఏ ఐ ఓ ఔ ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త

య ర ల వ శ ష స హ ళ.

ఇం దకారాదు లచ్చులు. కకారాదులు హల్లులు.
అజ్ల్విభాగ మీలాఁగుననే మీఁద నెఱుంగునది.

(పాణినీయాదులచే) సంస్కరింపబడినభాష కావున సంస్కృతము. ధ్వనులను వర్ణించునది గావున వర్ణము. సంస్కృతభాషకు వర్ణములు ఏఁబది. సంస్కృత భాషయందలిపదములు అన్నియు ఈఏఁబది వర్ణములతో మాత్రమే ఏర్పడును. వాఙ్మయమును విభాగించునపుడు (గ్రంథములు) వాక్యములుగను, వాక్యము పదములుగను, పదము అక్షరములుగను, అక్షరము వర్ణములుగను విడిపోవును. కావున ఏభాష కైనను మూలపదార్థము వర్ణమె. భాషకు వ్యాకరణము చెప్ప బూనినపుడు దానికి మూల మైనవర్ణములను గూర్చి ముందుగా చెప్పుట సక్రమము. ఆంధ్రభాషలో సంస్కృతసమములు అధికము. అం దుండునవి. సంస్కృతవర్ణములు. కావున ఆంధ్రవ్యాకరణమున ముందుగా సంస్కృతవర్ణములు చెప్పబడినవి.

అకారము మొదలగునవి అచ్చులు. 'కకారాదులు హల్లులు' అనుటచే కకారమునకు పూర్వమువర కున్న '16' వర్ణములకు అచ్చులు అని సంజ్ఞ. అనుస్వారము, విసర్గ అనునవి ముందు స్వరము లేక పలుకుట కష్టసాధ్యము. ఇంకను అవి స్వరమును అనుసరించియె ఉండును. అందుకే అచ్చులలో మొదటి దగుహ్రస్వ మైన అకారమును ముందు చేర్చి అనుస్వార, విసర్గములు అం, అః అని చూపబడినవి. కకారమునకు పూర్వమే నిర్దేశింపబడుటచే తెలుగున................

  • Title :Bala Vyakaranamu
  • Author :Paravastu Chinnaiahsuri
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN5693
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :399
  • Language :Telugu
  • Availability :instock