వ్యాసుడు - భారత రచన
వ్యాసుడు కలగాపులగంగా ఉన్న వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అని విభజించి వేదవ్యాసుడయ్యాడు. వేదాలలోని విశేషాలతో కథారూపంగా ఒక రచన చేయాలని సంకల్పించి, బ్రహ్మదేవుని పూజించాడు. ప్రత్యక్షమైన బ్రహ్మతో "ఓ సృష్టికర్తా! నాలుగు వేదాల సారాన్ని గ్రహించి పంచమవేదంగా 'మహాభారతం' అనే రచన చేయ సంకల్పించాను. ఆ రచన నిరాటంకంగా కొనసాగాలంటే సమర్థుడైన లేఖకుడు కావాలి. అటువంటి సమర్థుడెవరో మీరే సూచించండి” అని ప్రార్థించాడు.........................