ఒక రోజు దేవముని అయిన నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు వాల్మీకితో సంభాషిస్తున్న సందర్భంలో "దేవర్షీ! ఉత్తమ గుణాలు, బలపరాక్రమాలు, నీతిధర్మాలు తెలిసిన మహాపురుషులు ఎవరైనా ఉన్నారా ?” అని ప్రశ్నించాడు వాల్మీకి.
అందుకు నారదుడు "ఎందుకు లేడు మునీంద్రా ! ఉన్నాడు. సకల ధర్మాలు తెలిసిన వీరుడు, మానవోత్తముడైన మహాపాలకుడు శ్రీరామచంద్రుడు. ఆయన అయోధ్యానగరానికి రాజైన దశరథుని పుత్రుడు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం" అని బదులు చెప్పాడు. అటువంటి పురుషుడున్నాడని తెలిసి వాల్మీకి సంతోషించాడు.
ఒకరోజు వాల్మీకి సంధ్యావందనం కోసం తమసా నదికి వెళ్ళాడు. వెంట శిష్యులు కూడా ఉన్నారు. తీరంపై ఉన్న ఒక చెట్టుపై క్రౌంచ పక్షుల జంట మధురంగా గానం చేస్తూ సరసాలాడు కుంటున్నది. వాల్మీకి వాటిని చూస్తూ, వాటి గానాన్ని ఆలకిస్తూ ఆనందిస్తున్నాడు. అంతలో ఒక పక్షి విలవిల కొట్టుకుంటూ క్రిందపడి మరణించింది. రెండవ పక్షి విలపించసాగింది. పక్షి మరణానికి కారకుడైన బోయవాడు వాల్మీకి కంటికి కనపించగానే, అప్రయత్నంగా ఆయన నోటివెంట ఒక శ్లోకం వెలువడింది.
మానిషాద ప్రతిష్ఠాం త్వమ్ - అగమశ్శాశ్వతీ స్సమాః
యక్రౌంచ మిథునాదేకం - అవధీః కామమోహితమ్.
ఆ శ్లోకం శాపమైపోయింది. బోయవాడు క్రిందపడి మరణించాడు. వాల్మీకి వికలమైన మనస్సుతో ఆశ్రమానికి వెళ్ళాడు.
ఆ రోజు రాత్రి బ్రహ్మదేవుడు వాల్మీకికి కనిపించాడు. "వాల్మీకీ ! నువ్వు లోకం కోసం చేయవలసిన పని ఒకటి ఉంది. ఆ కార్యాన్ని నెరవేర్చి నీ జన్మను సార్థకం చేసుకో !" అన్నాడు బ్రహ్మ. ఆ కార్యమేమిటో తెలుపుమన్నాడు వాల్మీకి.
"గతంలోనే అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని గొప్పతనం గురించి నారదుడు నీకు తెలియజేశాడు. ఆయన చరిత్రను నువ్వు 'రామాయణం' అనే పేరుతో గ్రంథంగా వ్రాయాలి. అదే ఆదికావ్యం అవుతుంది. ఆ మహాపురుషుని జీవిత కథను రచనగా చేసేటప్పుడు ఆ కథ............................