సాహిత్యం : జొన్నవిత్తుల
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాకీ(శ్లో) : వక్రతుండ మహాకాయ... కోటిసూర్య సమప్రభ...
పల్లవి
గానం : బాలు
నటులు : బాలు, పిల్లలు
నిర్విఘ్నం కురుమేదేవా...సర్వకార్యేషు సర్వదా... ఆ...ఆ...ఆ... జయ జయ జయ జయ వినాయకా... శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకా... జయ జయ జయ జయ వినాయకా... శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకా...
ఆ...ఆ...ఆ...ఆ...
చరణం : 1) బాహుదా నదీ తీరములోన... బావిలోన వెలసిన దేవా...
మహిలో జనులకు మహిమలు చాటి...
ఇహ పరములనిడు మహానుభావా... ఇష్టమైనది వదిలిన నీకడ... ఇష్ట కామ్యములు... తీర్చే గణపతి...కరుణను కురియుచు... వరముల నొసగుచు... నిరతము పెరిగే మహాకృతి... సకల చరాచర ప్రపంచమే... సన్నుతి చేసే విఘ్నపతి....
నీ గుడిలో చేసే సత్యప్రమాణము...ధర్మ దేవతకు నిలుపును ప్రాణం....
విజయకారణం... విఘ్ననాశనం... కాణిపాకలో నిదర్శనం.....
చరణం : 2) పిండి బొమ్మవై ప్రతిభచూపి... బ్రహ్మాండ నాయకుడివైనావు....
మాతా పితలకు ప్రదక్షిణముతో... మహా గణపతిగ మారావు...
భక్తుల మొరలాలించి బ్రోచుటకు... గజముఖ గణపతివైనావు....
బ్రహ్మాండమునే బొజ్జలోదాచి... లంబోదరుడవు అయినావు...
లాభము...శుభము... కీర్తిని గూర్చగ... లక్ష్మీగణపతివైనావు....
వేదపురాణము లఖిల శాస్త్రములు... కళలు చాటును నీ వైభవం....
వక్రతుండమే ఓంకారమని... విభుదులు చేసే నీ కీర్తనం...
అంత్య ఆలాపన: ఆ... ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
విఘ్నేశ్వర స్తుతి!
నాడు ఘంటసాల 'వినాయక చవితి' చిత్రంలో 'వాతాపి 'గణపతిం భజే' పాడిన పాట స్థాయిలోనే ఆ పాట ప్రక్కన నిలిచిన ' పాట బాలు పాడిన 'దేవుళ్ళు' చిత్రంలోని పైపాట! నేడు ఏ ఉ త్సవమైనా విఘ్నేశ్వరస్తుతికి ఈ పాటలే వినిపిస్తాయి. దేవుళ్ళు చిత్రంలో బాలు నటిస్తూ పాడారు. ఆయన పాడిన ఒక ప్రత్యేక మధుర గీతం ఇది.