• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Banavathi
₹ 250

ప్రవేశిక

ఈ కాలంలో పీఠిక గాని, ప్రవేశిక గాని, మున్నుడి గాని ఏదో పేరుతో రెండు పేజీలు, మరీ గొప్ప పుస్తకం అయితే ఇంకా ఎక్కువ పేజీలు వ్రాస్తేగాని గ్రంథకర్తకైనా, ప్రకటన కర్తకైనా తృప్తి ఉండేటట్లు కనిపించటం లేదు. పాఠకుడికి కూడా ఇది అవసరమేమో తెలియటంలేదు. సినిమా తీస్తాడు. ప్రజలు దీనిని వాంఛిస్తున్నారు. అని అంటాడు. వాంచిస్తున్నారని నీకెట్లా తెలుసునయ్యా అంటే, వీడు తీసిన బొమ్మని వారు ఎగబడి చూడటమే వారు వాంఛిస్తున్నారన్న దానికి సాక్ష్యం. సినిమా వెట్టి పుట్టింది, దేన్నిపడితే దాన్నే చూస్తారు. సరదాకు అనేక వెల్లులు. నీవు ఆ తీసిన బొమ్మలో ఎన్ని వెఱ్ఱులు చూపిస్తే అంత ఎక్కువ డబ్బు వస్తుంది. అంత విరగబడి చూడటం జరుగుతుంది ! ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్న వ్యవహారం అది. కల్లు తాగబోయించి, వాళ్ళకది అలవాటు చేసి, 'త్రాగేవాళ్ళు మానేస్తే నేను కల్లు దుకాణం ఎత్తేస్తాను, వాళ్ళచేత తాగడం మానిపించండి' అన్న వాదన ఉన్నది. ఇది అలాంటిది.

అసలు ఒక పుస్తకానికి పీఠిక ఎందుకు?

పీఠికతో బాటు కొన్ని పండితాభిప్రాయాలు కూడా ఉంటే మరీ లాభం. ఎందుచేత నంటే చదివేవాడు ఇవి రెండూ చదువుతాడు. పుస్తకాన్ని గురించి తెలిసిపోతుంది. ఇహ పుస్తకం చదవనక్కర్లేదు. అందుచేత ఈ పీఠికలూ పండితాభిప్రాయాలూ పుస్తకాన్ని చదవకుండా చేస్తున్నాయా? అన్నది ప్రశ్న అవుతున్నది. అది ఏమీ కాదు పుస్తకాన్ని ఎప్పుడూ చదవడు. ఇక ఈ పీఠికలు, పండితాభిప్రాయాలు ఏమి చేస్తున్నాయంటే కనీసం పుస్తకాన్ని గురించి కొంత తెలుసుకొనేటట్లైనా చేస్తున్నాయి. పుస్తకం చదివే ఓపిక ఎవరికి ఉన్నది ? తీరిక ఎవరికి ఉన్నది ? పుస్తకం చదవలేదని ఎవరినన్నా అనటమే తప్పు, బ్రతకటమెట్లాగా అన్నది ప్రశ్న అయినప్పుడు పుస్తకాలు చదవమనటం అంత న్యాయం కాదు పుస్తకం చదవటానికి ఒకటి తీరిక ఉండాలి. రెండవది చదివితే అర్థం చేసుకొనే శక్తి ఉండాలి. ఆ శక్తి ఎలా వస్తుందయ్యా అంటే అనేక విధాలుగా వస్తుంది. సరియైన ఏ విధము కూడా మనదేశంలో ఆచరణలో ఉన్నట్లులేదు. ఈ రోజుల్లో ఎవరైనా పుస్తకం చదివాడంటే తన భావాలు పుస్తకాలలో ఉన్నయా లేవా అనేదాని కోసం చదువుతాడు తప్ప వాడేమి వ్రాశాడని చదవడు. వాడు వ్రాసినభావాలు తనకు వ్యతి రేకంగా ఉంటే వాడ్ని తూర్పార పడతాడు.

ఇది ప్రకృతి శాస్త్రయుగం. అంటే గణితశాస్త్ర యుగం. రెండూ రెండూ కలిపితే నాలుగు ఎట్లా అవుతుందో అంతా అల్లా టంచన్ గా అయితీరాలి. అందరూ ప్రత్యక్ష ప్రమాణవాదులు. ప్రత్యక్ష ప్రమాణులు కాదు. తత్పమాణ వాదులు. రెంటికీ భేదం.................

  • Title :Banavathi
  • Author :Viswanadha Satyanarayana
  • Publisher :Sri Viswanadha Publications Pvt Ltd
  • ISBN :MANIMN5042
  • Binding :Papar back
  • Published Date :2023 6th Print
  • Number Of Pages :195
  • Language :Telugu
  • Availability :instock